క్రీడాభూమి

భారత్ లక్ష్యం క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 14: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు బుధవారం నాటి చివరి, మూడో వనే్డలోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో జింబాబ్వే టూర్‌లో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అంతర్జాతీయ పోటీల్లో అంతగా అనుభవం లేని క్రీడారులతో కూడిన జట్టుకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ 2014 తర్వాత మొదటిసారి విదేశాల్లో ఒక వనే్డ సిరీస్‌ను గెల్చుకున్నాడు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకే పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లోనూ పగ్గాలను అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకున్న తరుణంలో ధోనీకి ఈ సిరీస్ విజయం ఊతమిచ్చింది. చివరి వనే్డను కూడా సాధించడం ద్వారా జింబాబ్వేపై భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఏమాత్రం నిలకడలేకుండా ఆడుతున్న జింబాబ్వేను చివరి వనే్డలోనూ భారత్ మట్టి కరిపించి, సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకుంటుందని విశే్లషకుల అభిప్రాయం.
ప్రయోగాల సమయం
ఇప్పటికే సిరీస్‌ను గెల్చుకున్నందున ప్రయోగాలకు ధోనీ సిద్ధమవుతున్నాడు. ఓపెనర్ లోకేష్ రాహుల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. అందుకే, అతనికి విశ్రాంతినిచ్చి, కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాన్ని ఫైజ్ ఫైజల్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. ఫైజల్‌తోపాటు జట్టుకు అనూహ్యంగా ఎంపికైన మన్దీల్ సింగ్‌కు ఒక ఛాన్స్ ఇవ్వాలని ధోనీ అనుకుంటే, అంబటి రాయుడుకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. టాప్ ఆర్డర్‌లో ముగ్గురిని మినహాయిస్తే, మిగతా వారికి రెండు వనే్డల్లో బ్యాటింగ్ చేసే అవకాశమే లభించలేదు. కాబట్టి బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఏవైనా ఉంటే మొదటి మూడునాలుగు స్థానాలకే అది పరిమితం కానుంది. బౌలింగ్ విభాగానికి వస్తే బరీందర్ శరణ్, ధవళ్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రాలలో ఒకరికి విశ్రాంతినిచ్చి, జయదేవ్ ఉనాద్కత్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకోవచ్చు. అదే విధంగా అక్షర్ పటేల్ లేదా యుజువేంద్ర చాహల్‌లలో ఒకరిని బెంచ్‌కి పరిమితం చేస్తే, ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌తో వనే్డ కెరీర్‌ను ఆరంభించిన ఆల్‌రౌండర్ రిషీ ధావన్‌కు బుధవారం నాటి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతున్నది.
ఇలావుంటే, జింబాబ్వే ఇప్పటికే రెండు మ్యాచ్‌లను చేజార్చుకొని సిరీస్‌ను కోల్పోగా, కనీసం ఒక విజయంతో వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని ఆశిస్తున్నది. అయితే, భారత్‌ను ఓడించే సత్తా ఆ జట్టుకు లేదన్నది వాస్తవం. కోచ్ డేవ్ వాట్‌మోర్‌పై జింబాబ్వే క్రికెట్ అధికారులు వేటు వేయడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. దీనికితోడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది. అన్ని విధాలా పతనావస్థలో ఉన్న జింబాబ్వే మూడో వనే్డలో భారత్‌కు గట్టిపోటీనిస్తుందా అన్నది ప్రస్తుతానికి అనుమానంగానే ఉంది.
మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవుతుంది.