క్రీడాభూమి

సాంచెజ్ సూపర్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడేల్ఫియా, జూన్ 15: అలెక్సిస్ సాంచెజ్ కీలక సమయంలో రెండో గోల్స్‌తో రాణించడంతో కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చిలీ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. సాంచెజ్‌తోపాటు ఎడ్యుయార్డో వర్గాస్ కూడా ‘డబుల్’తో రాణించాడు. వీరిరువురి ప్రతిభ పనామతో జరిగిన మ్యాచ్‌లో చిలీకి 4-2 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే పనామాకు మిగుల్ కామర్గో తొలి గోల్‌ను అందించాడు. దీనితో కంగుతిన్న చిలీ ఎదురుదాడికి దిగింది. 15వ నిమిషంలో వర్గాస్ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత కూడా దాడులను కొనసాగించిన చిలీకి అతను 43వ నిమిషంలో మరో గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు. మరో ఏడు నిమిషాల్లోనే సాంచెజ్ సాధించిన గోల్‌తో చిలీ ఆధిక్యం 3-1కి చేరింది. తీవ్రంగా శ్రమించిన పనామాకు 75వ నిమిషంలో అబ్దెల్ అరోయో ద్వారా ఒక గోల్ లభించింది. కానీ, అప్పటికే ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న చిలీకి సాంచెజ్ 89వ నిమిషంలో మరో గోల్‌ను అందించి, జట్టును 4-2 తేడాతో, తిరుగులేని స్థితిలో నిలిపాడు. చివరికి అదే ఆధిక్యంతో చిలీ విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. సెమీస్‌లో స్థానం కోసం ఈ జట్టు మెక్సికోను ఢీ కొంటుంది.
క్వార్టర్స్‌కు అర్జెంటీనా
అర్జెంటీనా జట్టు కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. బొలీవియాతో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 3-0 తేడాతో గెల్చుకుంది. 13వ నిమిషంలో ఎరిక్ లమెలా, 15వ నిమిషంలో ఇజెక్వెల్ వావెజీ, 32వ నిమిషంలో విక్టర్ క్యూస్టా గోల్స్ సాధించారు. ఆతర్వాత అర్జెంటీనా ఒక్కసారిగా దాడులను నిలిపేసి, డిఫెన్స్‌కు పరిమితమైంది. బొలీవియా గోల్స్ కోసం చేసిన విఫలమయ్యాయి. ఆది నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచిన అర్జెంటీనా క్వార్టర్స్‌లో వెనెజులాతో పోరును ఖాయం చేసుకుంది. కాగా, ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ఈక్వెడార్‌తో అమెరికా, కొలంబియాతో పెరూ జట్లు ఢీ కొంటాయి.