క్రీడాభూమి

57 కాదు.. 21 మందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 15: టీమిండియా కోచ్ పదవికి 57 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, క్రికెట్ సలహా మండలి ఆ జాబితాను 21కి కుదించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ కార్యదర్శి, జాతీయ సెలక్టర్ సంజయ్ దగ్దాలే సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ మండలిలో మాజీ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ సభ్యులుగా ఉన్నారు. బోర్డుకు అందిన దరఖాస్తులను వీరు క్షుణ్ణంగా పరిశీలించారు. కోచ్ పదవిని చేపట్టే సామర్థ్యం ఉన్న 21 మంది దరఖాస్తులను మాత్రమే ఎంపిక చేశారు. ఈ జాబితాను త్వరలోనే బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు పంపుతారు. ఈనెల 24న ధర్మశాలలో జరిగే బిసిసిఐ వర్గింగ్ కమిటీ సమావేశంలో కోచ్‌ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయ.

యూరో 2016
హంగరీ బోణీ
పారిస్, జూన్ 15: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో హంగరీ బోణీ చేసింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 2-0 తేడాతో గెల్చుకుంది. ఇప్పటి వరకూ ఈ టోర్నీలో చాలా జట్లు అనుసరిస్తున్న మితిమీరిన డిఫెన్స్‌నే ఈ రెండు జట్లు కూడా అనుసరించాయి. ఫలితంగా ప్రథమార్ధంలోనేగాక, ద్వితీయార్ధం ఆరంభంలోనూ గోల్స్ నమోదు కాలేదు. డెడ్‌లాక్‌ను ఛేదిస్తూ 62వ నిమిషంలో ఆడం జలాయ్ హంగరీకి తొలి గోల్‌ను అందించాడు. 87వ నిమిషంలో జొల్టాన్ స్టీబెర్ మరో గోల్ సాధించిపెట్టాడు. ఆస్ట్రియా గోల్స్ చేయడంలో విఫలమైంది.
పోర్చుగల్, ఐస్‌లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆరు జట్లు చెరొక గోల్ చేశాయి. మ్యాచ్ 31వ నిమిషంలో పోర్చుగల్‌కు నాని గోల్‌ను అందిస్తే, 50వ నిమిషంలో బిర్కిర్ బర్నసన్ ఐస్‌లాండ్‌కు ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టాడు. ఆతర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం ప్రయత్నించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

దుంగాపై వేటు
రియో డి జెనీరో, జూన్ 15: కోపా అమెరికా సాకర్ టోర్నీలో బ్రెజిల్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడం ఆ జట్టు కోచ్ పదవికి ఎసరుపెట్టింది. గత 27 ఏళ్లలో మొదటిసారి బ్రెజిల్ గ్రూప్ దశ నుంచే వెనుదిరిగింది. ఈ ఓటమితో అభిమానులు నిరాశ చెందగా, బ్రెజిల్ సాకర్ అధికారులు ఆగ్రహించారు. కోచ్ దుంగాపై వేటు వేశారు. కాగా, ఈ పరిణామం తనను ఎంత మాత్రం భయపెట్టలేదని దుంగా వ్యాఖ్యానించాడు. తాను చావుకు తప్ప దేనికీ భయపడనని అతను విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. బ్రెజిల్ తరఫున ఆటగాడిగా కెరీర్‌ను కొనసాగించినప్పుడు అతను రెండు పర్యాయాలు కోపా అమెరికా ట్రోఫీని స్వీకరించాడు. 1994లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న బ్రెజిల్ జట్టుకు అతనే కెప్టెన్. ఆటగాడిగా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన అతను కోచ్‌గా విఫలమయ్యాడు. చివరికి ఆ పదవిని కోల్పోయాడు.

సస్పెన్షన్‌పై సిఎఎస్‌లో
షరపోవా పిటిషన్
లాసనే్న, జూన్ 15: తనపై రెండేళ్ల సస్పెన్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను ఆశ్రయించింది. మెల్డోనియం అనే ఔషధాన్ని తాను వాడుతున్నట్టు షరపోవా స్వయంగా ప్రకటించి సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యుటిఎ) ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ ఆమెపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా ఉత్ప్రేరకాలను వాడలేదని ఆమె ప్రకటించింది. మెల్డోనియంను ఈ ఏడాది జనవరిలో ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిషేధించిందని, అయితే, తాను గత పదేళ్ల నుంచి ఆ మందును వాడుతున్నానని సిఎఎస్‌కు సమర్పించిన పిటిషన్‌లో ఆమె పేర్కొంది. గుండె జబ్బులతోపాటు సాధారణ రుగ్మతలకు వాడే వివిధ బ్రాండ్ల మందుల్లో మెల్డోనియం ఉంటుంది. నిన్నమొన్నటి వరకూ దీనిని నిషిద్ధ మాదక ద్రవ్యంగా ఎవరూ పేర్కోలేదు. ఈఏడాది జనవరిలో వాడా జారీ చేసిన నిషిద్ద మాదక ద్రవ్యాల జాబితాలో మెల్డోనియం కూడా చేరింది. కానీ, దానిపై అవగాహన లేని చాలా మంది ఇప్పటికీ ఆ ఔషధాన్ని వాడుతున్నారు. కాగా, తాను ఉత్ప్రేరకం మాదిరి మెల్డోనియంను వినియోగించలేదని షరపోవా అంటున్నది. వివరాలు తెలియక పొరపాటు జరిగిందే తప్ప డోపింగ్‌కు పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేస్తున్నది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే రష్యా టెన్నిస్ బృందంలో షరపోవా స్థానం సంపాదించింది. సస్పెన్షన్ కొనసాగితే, ఆమెకు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ఉండదు. అందుకే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లేదా సడలింపు ఇవ్వాలని కోరుతూ ఆమె సిఎఎస్‌లో పిటిషన్ దాఖలు చేసింది.