క్రీడాభూమి

టీమిండియా కోచ్ పదవికి ద్విముఖ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి రవి శాస్ర్తి, సందీప్ పాటిల్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈనెల 21 నుంచి 24 వరకు ధర్మశాలలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కీలక సమావేశం జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వాహణతోపాటు పాలనా వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించడం వంటి పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేస్తారని సమాచారం. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ వివిఎస్ లక్ష్మణ్, సచిన్ తెండూల్కర్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ ఇప్పటికే కోచ్ పదవిపై దృష్టి సారించింది. మొత్తం 57 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ 21 పేర్లను పరిశీలనకు ఖరారు చేసింది. టీమిండియా డైర్టెర్‌గా వ్యవహరించిన రవి శాస్ర్తీ, జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ దరఖాస్తు చేసుకోగా, తాజాగా అనీల్ కుంబ్లే పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితోపాటు బల్వీందర్ సింగ్ సంధు, స్టువర్ట్ లా తదితరులు కూడా తీవ్రంగా పోటీపడుతున్నారు. అయితే, పోటీ ప్రధానంగా రవి శాస్ర్తీ, సందీప్ పాటిల్ మధ్య ఉంటుందని అంచనా. కాగా, మన దేశంలో ఉన్న భిన్న సంస్కృతులను గురించి తెలిసిన వారు, హిందీలో మాట్లాడగలిగే వారిని కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ చేసిన సూచనను బిసిసిఐ అధికారులు పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. అదే నిజమైతే, విదేశీయుడ్ని కాకుండా భారతీయుడికే కోచ్ పదవి దక్కడం ఖాయం. రవి శాస్ర్తీ సేవల ఆవస్యకతను గుర్తించిన బిసిసిఐ భారత జట్టుకు డైరెక్టర్ పదవిని సృష్టించి మరీ అతనికి కట్టబెట్టింది. సుమారు 18 నెలలు అతను అదే పదవిలో కొనసాగాడు. టి-20 వరల్డ్ కప్ టోర్నీలో అతని కాంట్రాక్టు ముగియడంతో మరోసారి అదే పోస్టుతోపాటు కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ కూడా అనుకోకుండా రేసులోకి దిగాడు. భారత క్రికెట్‌ను ఆది నుంచి ముంబయి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శాసిస్తున్నది. చివరికి బిసిసిఐ కేంద్ర కార్యాలయం కూడా అక్కడే ఉంది. పాటిల్ మహారాష్టక్రు చెందిన వాడు కాకపోతే, రవి శాస్ర్తీ ఎంపిక లాంఛన ప్రాయమే అయ్యేదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పాటిల్ కూడా ముంబయికరే కావడంతో పోరు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కుంబ్లే, సంధూ, స్టువర్ట్ లా తదితరుల పోటీ నామమాత్రంగానే ఉంటుందని, ద్వైపాక్షిక పోటీ కొనసాగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సలహా కమిటీ కీలక పాత్ర
టీమిండియాకు కొత్త కోచ్‌ను ఎంపిక చేయడంలో గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌లతో కూడిన సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ముగ్గురూ మాజీ క్రికెటర్లు కావడం, వీరిలో ఇద్దరినికి నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉండడంతో వారి అభిప్రాయాలకే ప్రాధాన్యమివ్వాలని బిసిసిఐ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. క్రికెట్‌కు సంబంధించిన విషయాల్లో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కాకుండా క్రికెటర్లే నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను రూపుదిద్దాల్సిన అవసరం ఉందని ఇటీవల ఒక కేసు సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా బిసిసిఐ పరిగణలోకి తీసుకుంటున్నది. దీనికితోడు ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న కారణంగా కోచ్ ఎంపిక విషయాన్ని పూర్తిగా సొంతంగానే తలకెత్తుకునే ప్రయత్నాన్ని విరమించుకుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ బాధ్యతను పరోక్షంగా సలహా కమిటీకి అప్పగించనుందని ఈ వర్గాలు అంటున్నాయి. ఈనెల 22న బిసిసిఐకి కమిటీ నివేదికను సమర్పిస్తుంది. అందులో దాదాపుగా కోచ్‌ని ఖరారు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే బిసిసిఐ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా, రవి శాస్ర్తీతో గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌లకు సాన్నిహిత్యం ఉంది. సందీప్ పాటిల్ చాలా సీనియర్ కావడంతో అతనితో వీరికి అంతగా చనువు లేదు. ఈ కోణంలో చూస్తే సలహా కమిటీ రవి శాస్ర్తీ పేరునే ప్రతిపాదిస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

చిత్రాలు టీమిండియా కోచ్ రేసులో నంబర్ వన్ రవి శాస్ర్తి,
రవి శాస్ర్తికి గట్టిపోటీనిస్తున్న సందీప్ పాటిల్