క్రీడాభూమి

పిస్టోరియస్ జైలుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జూన్ 16: రెండు కాళ్లూ లేకపోయినా, కృత్రిమ కాళ్లతోనే పరుగులు తీస్తూ, ప్రపంచ మేటి అథ్లెట్‌గా ఎదిగిన ఆస్కార్ పిస్టోరియస్ తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్ హత్య కేసులో మళ్లీ జైలు ఊచలు లెక్కించడం ఖాయంగా కనిపిస్తున్నది.ఈ కేసులో చివరి దశ వాదోపవదాలు కొనసాగుండగా, త్వరలోనే కోర్టు తుది తీర్పునివ్వనుంది. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించడమేగాక, సమ్మర్ ఒలింపిక్స్‌లో సాధారణ అథ్లెట్స్‌తో పోటీపడిన మొట్టమొదటి వికలాంగ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ‘బ్లేడ్ రన్నర్’గా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పిస్టోరియస్ హత్య కేసులో ఇరుక్కొని ఒక్కసారిగా ప్రతిష్ట కోల్పోయాడు. 2013లో ‘ప్రేమికుల రోజు’నే తన ప్రేయసి రీవాను హత్య చేశాడన్న అభియోగంపై విచారణను ఎదుర్కొంటున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తన గదిలోకి చొరబడ్డారన్న అనుమానంతో కాల్పులు జరిపానని, రీవా హత్య ఉద్దేశపూర్వకంగా జరగలేదని పిస్టోరియస్ చేసిన వాదనను ఇప్పటికే కోర్టు తోసిపుచ్చింది. రీవాను హత్య చేయాలన్న ఉద్దేశం అతనికి లేకపోయినా, అనధికారికంగా తుపాకీని కలిగి ఉండడం, కాల్పులు జరపడం అతను చేసిన తప్పులని ఇది వరకే ప్రకటించింది. అతనిని దోషిగా తేల్చింది. కాగా, రీవాను పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ పలు సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు ఉంచింది. విచారణ అనంతరం దక్షి ణాఫ్రికా సుప్రీం కోర్టు అతనికి 15 సంవత్సరాల జైలు శిక్షను విధిం చింది. అయతే, కేసును పునర్విచారించాలన్న పిస్టోరియస్ అభ్యర్థ న నేరకు మరోసారి కేసు కోర్టుకొచ్చింది. ప్రస్తుతం గృహ నిర్బంధం లో ఉన్న పిస్టోరియస్ నేరం రుజువైతే జైలుకెళ్లడం ఖాయం. దక్షిణా ప్రికా చట్టాల ప్రకారం అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, వా టిని ఉపయోగించడం తీవ్ర నేరాలు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకం గా హత్య చేయలేదని కోర్టు భావించినా, అక్రమ ఆయుధాల చట్టం కింద అతనికి శిక్ష పడుతుంది. గురువారం కోర్టులో తన నిర్దోషిత్వా న్ని రుజువు చేసుకునే ప్రయత్నంలో అతను కృత్రిమ కాళ్లను పెట్టు కోకుండానే కోర్టులో నడుస్తు, తాను వేగంగా కదల్లేనని అందుకే కాల్పులు జరిపానని పేర్కొన్నాడు.

చిత్రం కృత్రిమ కాళ్లు లేకుండా కోర్టు హాల్‌లో నడుస్తున్న పిస్టోరియస్