క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 16: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ మరోసారి నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశ పరచింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ని 2-4 తేడాతో చేజార్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత గోల్‌పోస్టుపై దాడులకు ఉపక్రమించిన ఆస్ట్రేలియాకు 20వ నిమిషంలో ట్రెంట్ మిటన్ తొలి గోల్‌ను అందించాడు. 23వ నిమిషంలో అరాన్ జలెవ్‌స్కీ మరో గోల్‌ను సాధించిపెట్టాడు. అదే దూకుడును కొనసాగించిన ఆసీస్ 35వ నిమిషంలో ఫ్లిన్ ఆగిల్వీ ద్వారా మూడో గోల్‌ను ఖాతాలో వేసుకుంది. సంయమనం కోల్పోయన భారత్ అతి కష్టం మీద 45వ నిమిషంలో ఒక గోల్‌ను సాధించింది. రఘునాథ్ ఈ గోల్‌ను చేసిన ఆనందం భారత్‌కు కొన్ని క్షణాలు కూడా నిలవలేదు. సెకెన్ల వ్యవధిలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రైన్ వైట్ గోల్ చేసి, తన జట్టు ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు. మరో నాలుగు నిమిషాల తర్వాత మన్దీప్ సింగ్ చక్కటి ఫీల్డ్ గోల్ చేశాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయది. ఆతర్వాత గోల్స్ చేయడంలో విఫలమైన భారత్ 2-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.