క్రీడాభూమి

అంతా ట్రాష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అమెరికాకు చెందిన షానన్ మెరీని తాను వివాహం చేసుకున్నట్టు వచ్చిన వార్తలను భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ ఖండించాడు. తాను మూడో పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన అజరుద్దీన్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి బాలీవుడ్ నటి సంగీత బిజలానీని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం క్రితం ఆమె నుంచి కూడా అతను విడిపోయాడు. కాగా, తన కారుడ్రైవర్ జాన్ మహమ్మద్ ముంబయిలో మృతి చెందగా, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి అజర్ వెళ్లాడని ఒక మరాఠీ పత్రికలో వార్త వచ్చింది. ఆ సమయంలో షానన్‌ను తన భార్యగా అజర్ పరిచయం చేశాడని ఆ పత్రిక పేర్కొంది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో భాగంగా ఢిల్లీలో ఇండియన్ ఏసస్, ఫిలిప్పీన్ మావెరిక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లను అతను షానన్‌తో కలిసి తిలకించాడని పేర్కొంది. ఇలావుంటే, అజరుద్దీన్, షానన్ కలిసివున్న ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడంటూ తనపై వస్తున్న వార్తలకు తెరదించేందుకు అజర్ ప్రయత్నించాడు. మూడో పెళ్లి వార్తలు నిరాధారమని ప్రకటించాడు. అంతా కట్టుకథేనంటూ కొట్టిపారేశాడు.