క్రీడాభూమి

సర్దార్‌పై కేసు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పంజాబ్ పోలీస్‌పైనా కేసు పెట్టాలని స్పష్టం చేసింది. సర్దార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ భారత సంతతికి చెందిన ఇంగ్లాండ్ మహిళా జట్టు సభ్యురాలు నిరుడు జనవరిలో ఆరోపించింది. అయితే, ఆమె ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. దీనితో ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. కేసు వివరాలు తెలుసుకున్న కమిషన్ తీవ్రంగా స్పందించింది. సర్దార్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

చిత్రం సర్దార్ సింగ్