క్రీడాభూమి

దుమ్ము రేపిన షనక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాలాహైడ్ (ఐర్లాండ్), జూన్ 17: రెండు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు దుసాన్ షనక ఆల్‌రౌండ్ ప్రతిభతో దుమ్ము రేపాడు. అటు బ్యాటింగ్‌లో విజృంభించి కేవలం 19 బంతుల్లో 42 పరుగులు సాధించిన షనక, ఇటు బౌలింగ్‌లోనూ చక్కగా రాణించి 43 పరుగులకే 5 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు 76 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. గత నెల నుంచి ప్రారంభమైన ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో శ్రీలంక జట్టుకు ఇదే తొలి విజయం. టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టులో షనకతో పాటు వికెట్ కీపర్ దినేష్ చండీమల్ (107 బంతుల్లో 100-నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కగా, కుశల్ మెండిస్ (59 బంతుల్లో 51), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (53 బంతుల్లో 49) తమ వంతు రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టులో ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (73), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఓబ్రియాన్ (64) రాణించినప్పటికీ పాల్ స్టిర్లింగ్ (27), స్టూవర్ట్ పాయింటర్ (20) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లను ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన ఐర్లాండ్ 40.4 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటవడంతో శ్రీలంక జట్టు 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.