క్రీడాభూమి

కలిసొచ్చిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టును అదృష్టం వరించింది. గురువారం అర్థరాత్రి (్భరత కాలమానం ప్రకారం) ఆతిథ్య బ్రిటన్-బెల్జియం జట్ల మధ్య జరిగిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్ 3-3 గోల్స్‌తో డ్రాగా ముగియడంతో భారత జట్టు 36 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 1978లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఆవిర్భవించినప్పటి నుంచి భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. 1982లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీఫైనల్ దశకు చేరుకుని కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇదే. అయితే ప్రస్తుతం భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతో కనీసం రజత పతకాన్ని గెలుచుకోవడం ఖాయమైంది. ఈ టోర్నీ చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2-4 గోల్స్ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం లీ వ్యాలీ హాకీ సెంటర్‌లో గురువారం అర్థరాత్రి బెల్జియంతో జరిగిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో ఆతిథ్య బ్రిటన్ జట్టు రెండు గోల్స్ వెనుకబడి ఉన్నప్పటికీ అనూహ్య రీతిలో పుంజుకుని విజృంభించింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసి రౌండ్ రాబిన్ లీగ్ పాయింట్ల పట్టికలో బ్రిటన్, బెల్జియం జట్లు దిగువన నిలవడంతో భారత్‌కు అదృష్టం కలిసొచ్చి ఫైనల్‌లో చోటు లభించింది. రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల ద్వారా మొత్తం 13 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 7 పాయింట్లతో భారత జట్టు ద్వితీయ స్థానంలోనూ, 6 పాయింట్లతో బ్రిటన్ మూడో స్థానంలోనూ, 4 పాయింట్లతో బెల్జియం నాలుగో స్థానంలోనూ నిలిచాయి. దీంతో శుక్రవారం అర్థరాత్రి జరుగనున్న ఫైనల్‌లో టైటిల్ కోసం భారత జట్టు మరోసారి ఆస్ట్రేలియాతో తలపడనుంది.
పాక్ క్రికెటర్లకు
డోపింగ్ పరీక్షలు
యాసిర్ షాపై ఐసిసి దృష్టి
లాహోర్, జూన్ 17: ఈ ఏడాది ఆరంభంలో మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటుకు గురైన లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సహా పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్ ఇంతికాబ్ ఆలమ్ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. యాసిర్ షాతో పాటు పాక్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా ఉల్‌హక్, వనే్డ జట్టు సారథి అజర్ అలీ, ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్‌లకు ఐసిసి డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపాడు. పాకిస్తాన్ జట్టు త్వరలో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ పర్యటన సమయంలో ఈ పరీక్షల ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. కనుక పైన పేర్కొన్న నలుగురిలో ఎవరైనా డోపింగ్‌కు పాల్పడినట్లు ఈ పరీక్షల్లో రుజువైతే ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టుపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)తో ఒప్పందంపై సంతకం చేసిన నాటి నుంచి ప్రతి క్రికెట్ పోటీలకు ముందు, తర్వాత ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. గత ఏడాది చివర్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో యాసిర్ షా ‘వాడా’ నిషేధించిన ‘క్లోర్టాలిడోన్’ అనే ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తేలడంతో డిసెంబర్‌లో అతనిపై ఐసిసి వేటు వేసింది. అయితే రక్తపోటు నివారణ కోసం తన భార్య ఉపయోగించే మందును ఉపయోగించానని, అందులో నిషిద్ధ ఉత్ప్రేరకరం ఉందన్న విషయం తెలియదని పేర్కొంటూ యాసిర్ షా తన నేరాన్ని ఓప్పుకోవడంతో అతనిపై ఐసిసి మూడు నెలల సస్పెన్షన్‌తో సరిపుచ్చింది. ఈ సస్పెన్షన్ మార్చి నెలాఖరుతో ముగియడంతో యాసిర్ షా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు అర్హత సాధించాడు. దీంతో ప్రస్తుతం నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో మిస్బా ఉల్‌హక్, అజర్ అలీ, జునైద్ ఖాన్ కంటే యాసిర్ షాపైనే ఐఓసి ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలున్నాయి.
ఫిఫా కార్యాలయంలో
ఓజిఎ సోదాలు
కీలక పత్రాలు స్వాధీనం
జ్యూరిచ్, జూన్ 17: జ్యూరిచ్‌లోని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ప్రధాన కార్యాలయంలో స్విట్జర్లాండ్ దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్ కార్యాలయం (ఓఎజి) వెల్లడించింది. అయితే ఇటీవల వేటుకు గురైన ఫిఫా డిప్యుటీ ప్రధాన కార్యదర్శి మార్కస్ కట్నర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు నిర్వహించారని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య పేర్కొంది. ఫిఫా వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సమాఖ్య ప్రధాన కార్యాలయంలో తనిఖీలు నిర్వహించామని, ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధారాలను ధ్రువీకరించుకోవడంతో పాటు మరింత సమాచారాన్ని సేకరించాలన్న లక్ష్యంతోనే ఈ సోదాలు జరిపి కొన్ని కీలక పత్రాలను, ఎలక్ట్రానిక్ డేటాను స్వాధీనం చేసుకున్నామని ఓఎజి ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంతకుమించి ఇతర వివరాలను ఓఎజి వెల్లడించలేదు. అయితే స్విస్ దర్యాప్తు అధికారులు కట్నర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారని ఫిఫా అధికార ప్రతినిధి డెలియా ఫిషర్ తెలిపాడు. ఫిఫా ఆడిట్ కమిటీల దృష్టిలోకి రాకుండా ఉంచిన ఒక ఒప్పందంలోని నిబంధనల కింద రహస్య బోనస్‌ల రూపంలో కోట్లా డాలర్ల సొమ్ము కాజేసినట్లు కట్నర్ (45)పై అభియోగాలు రావడంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య గత నెలలో అతడిని డిస్మిస్ చేసింది.