క్రీడాభూమి

‘కోపా అమెరికా’ సెమీస్‌కు అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియాటిల్, జూన్ 17: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అమెరికా జట్టు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి సియాటిల్‌లోని సెంచరీ లింక్ ఫీల్డ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జుర్గెన్ క్లిన్స్‌మన్ నేతృత్వంలోని అమెరికా జట్టు 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను మట్టికరిపించి టైటిల్ సాధన దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అమెరికా ఆటగాడు క్లింట్ డెంప్సీ మరోసారి చక్కటి ప్రదర్శనతో అలరించి తమ జట్టును సెమీస్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. పదేసి మంది ఆటగాళ్లతో ఎంతో వాడి వేడిగా ముగిసిన ఈ మ్యాచ్ 43వ నిమిషంలో డెంప్సీ అమెరికాకు తొలి గోల్‌ను అందించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లలో ఆడిన డెంప్సీకి ఇది మూడో గోల్ కాగా, లాస్ ఏంజెల్స్ గెలాక్సీ ఫార్వర్డ్ ఆటగాడు గ్యాసీ జర్దెస్ 65వ నిమిషంలో సాధించిన గోల్‌తో అమెరికా ఆధిక్యత 2-0 గోల్స్‌కు పెరిగింది. ఆ తర్వాత 74వ నిమిషంలో మైఖేల్ అరోయో ఈక్వెడార్‌కు గోల్‌ను అందించే ప్రయత్నం చేసినప్పటికీ అతని ప్రయత్నాన్ని అమెరికా ఆటగాళ్లు సమర్ధవంతంగా ప్రతిఘటించారు. దీంతో 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించిన అమెరికా జట్టు వచ్చే వారం హ్యూస్టన్‌లో జరిగే సెమీ ఫైనల్‌లో అర్జెంటీనా జట్టుతో గానీ వెనెజులా జట్టుతో గానీ తలపడుతుంది.
ఇదిలావుంటే, ఈ మ్యాచ్ ద్వితీయార్థం ప్రారంభంలో ఇరు పక్షాల ఆటగాళ్లు ఘర్షణకు దిగడంతో అమెరికా మిడ్‌ఫీల్డర్ జెర్మైన్ జోన్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో అతను సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అలాగే మరో మిడ్‌ఫీల్డర్ అలెజాండ్రో బెదోయా, హాంబర్గ్ స్ట్రైకర్ బాబీ ఉడ్‌కు ఎల్లోకార్డులు లభించడంతో సెమీఫైనల్‌లో ఆడకుండా వీరిపై కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. కాగా, ఘర్షణ ప్రారంభం కావడానికి ముందు ఈక్వెడార్ ఆటగాడు ఆంటోనియో వాలెన్సియా రెండుసార్లు ఎల్లో కార్డులు స్వీకరించడంతో అంపైర్లు అతడిని కూడా మ్యాచ్ నుంచి డిస్మిస్ చేశారు.