క్రీడాభూమి

టిటెకు బ్రెజిల్ పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావో పౌలో, జూన్ 18: మాజీ క్రీడాకారుడు టిటెను బ్రెజిల్ సాకర్ కోచ్ పదవి వరించిందని సమాచారం. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి బ్రెజిల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో, కోచ్ దుంగాపై సాకర్ అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. అతని స్తానంలో టిటెను నిమయించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతను ప్రస్తుతం సేవలు అందిస్తున్న కొరంథియాస్ జట్టు మేనేజ్‌మెంట్ ధ్రువీకరించింది. కానీ, బ్రెజిల్ సాకర్ సమాఖ్య ఎలాంటి ప్రకటన చేయలేదు. టిటె అసలు పేరు అడెనార్ లియోనార్డో బాచీ. దుంగా కంటే ముందు బ్రెజిల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన లూయిస్ ఫెలిప్ స్కాలరీ కూడా ఒకప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వాడే. అతను ఫుట్‌బాల్ కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలో, టిటె ఆటను చూసి ఆకర్షితుడయ్యాడు. ఒక క్లబ్ యాజమానానికి పరిచయం చేస్తున్నప్పుడు అతనిని బాచీ అని కాకుండా చిన్నపిల్లవాడు అనే ఉద్దేశంతో టిటె అని పరిచయం చేశాడు. దీనితో అదే పేరు స్థిరపడింది. టిటె మోకాలి గాయం కారణంగా తన 28వ ఏట కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత కోచ్ అవతారం ఎత్తాడు. పలు క్లబ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన అతను ప్రస్తుతం కొరంథియాస్‌కు చీఫ్ కోచ్‌గా ఉన్నాడు. అతని హయాంలోనే ఆ జట్టు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నత శిఖరాలనను అధిరోహించింది.