క్రీడాభూమి

యూరో 2016 ఫుట్‌బాల్ ప్రీ క్వార్టర్స్‌కు స్పెయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైస్ (ఫ్రాన్స్), జూన్ 18: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 3-0 తేడాతో విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్ 34వ నిమిషంలో అల్వరో మోరాటా స్పెయిన్‌కు తొలిగోల్‌ను అందించాడు. మరో మూడు నిమిషాల్లోనే థామస్ ఏవలిటో చేసిన గోల్‌తో స్పెయిన్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో గోల్ నమోదైన 11 నిమిషాల వ్యవధిలోనే మోరాటా తన ఖాతాలో రెండో గోల్‌ను వేసుకున్నాడు. అతను సాధించిన గోల్‌తో 3-0 ఆధిక్యానికి వెళ్లిన స్పెయిన్ ఆతర్వాత వ్యూహాత్మకంగా ఆడుతూ టర్కీకి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ని ముగించేసింది.
స్వీడన్‌పై ఇటలీ విజయం
స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఇటలీ 1-0 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి మొదలైన మరుక్షణం నుంచే మితిమిరీన రక్షణ విధానాన్ని అనుసరించిన ఇరు జట్లు దాదాపుగా చివరి వరకూ అదే పద్ధతిలో ఆడాడు. మ్యాచ్ 88వ నిమిషంలో మార్టిన్ ఎడెర్ ఇటలీకి కీలక గోల్‌ను సాధించిపెట్టాడు. ఆతర్వాత గోల్స్ నమోదు కాకపోవడంతో ఇటలీ గెలిచింది.
చెక్, క్రొయేషియా మ్యాచ్ డ్రా
చెక్ రిపబ్లిక్, క్రొయేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ సాధించాయి. చెక్ తరఫున మిలన్ స్కోడా, థామస్ నెసిడ్ గోల్స్ చేయగా, క్రొయెషియాకు ఇవాన్ పెరిసిక్, ఇవాన్ రాకిటిక్ గోల్స్‌ను అందించారు. ఇరు జట్లు పాయంట్లను పంచుకున్నాయ.