క్రీడాభూమి

కోపా అమెరికా సాకర్ క్వార్టర్స్‌లో యుఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీటిల్ (అమెరికా), జూన్ 18: కోపా అమెరికా సాకర్ టోర్నీలో అమెరికా జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈక్వెడార్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆ జట్టు 2-1 తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ 22వ నిమిషంలో అమెరికాకు క్లింట్ డెంప్సీ ద్వారా తొలి గోల్ లభించింది. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ఆరంభం నుంచే దాడులకు ఉపక్రమించిన అమెరికా 65వ నిమిషంలో గ్యాసీ జార్డెస్ ద్వారా రెండో గోల్‌ను సంపాదించుకుంది. మ్యాచ్ 74వ నిమిషంలో ఈక్వెడార్‌కు మైఖేల్ అరోయో గోల్‌ను అందించినా ఫలితం లేకపోయింది. 1-2 తేడాతో ఈక్వెడార్ ఓటమిపాలైంది.
షూటౌట్‌లో కొలంబియా గెలుపు
పెనాల్టీ షూటౌట్ వరకూ చేరిన ఒక ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో కొలంబియా 2-4 తేడాతో పెరూను ఓడించింది. ఇరు జట్లు పూర్తిగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో నిర్ణీత సమయం ముగిసే వరకూ గోల్స్ నమోదు కాలేదు. ఇంజురీ టైమ్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. దీనితో ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. కొంబియా తరఫున జేమ్స్ రోడ్రిగెజ్, జువాన్ క్వాడ్రాడో, డేరో మొరెనో, సెబాస్టియన్ పెరెజ్ తమతమ ప్రయత్నాల్లో సఫలమయ్యారు. పెరూ తరపున రాల్ రుడియాస్, రెనాటో టపియా గోల్స్ చేయలిగారు. కానీ, మిగుల్ ట్రాకూ, క్రిస్టియన్ క్యూవా విఫలం కావడంతో పెరూకు ఓటమి తప్పలేదు.