క్రీడాభూమి

ఎదురుదాడికి టీమిండియా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 19: జింబాబ్వేతో జరిగిన మొదటి టి-20 ఇంటర్నేషనల్‌లో అనూహ్యంగా రెండు పరుగుల తేడాతో ఓడిన టీమిండియా సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో ఎదురుదాడికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ని గెల్చుకోవడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవడానికి ధోనీ సేన చెమటోడ్చనుంది. మొదటి మ్యాచ్ చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సి ఉండగా, సులభమైన ఆ లక్ష్యాన్ని భారత్ ఛేదించలేక చేతులెత్తేసింది. నెవిల్లె మజీవా ఎంతో సమర్థంగా ఆ ఓవర్‌ను పూర్తి చేసి, ఐదు పరుగులిచ్చి, ఒక వికెట్ సాధించడం ద్వారా జింబాబ్వేను విజయపథంలో నిడిపాడు. రెండు పరుగుల తేడాతో జింబాబ్వే గెలవడం అతని ఘనతగానే చెప్పుకోవాలి. చివరి ఓవర్ ఆరంభమయ్యే సమయానికి అక్షర్ పటేల్, కెప్టెన్ ధోనీ క్రీజ్‌లో ఉండగా, భారత్ విజయం ఖాయంగా కనిపించింది. కానీ, పటేల్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. చివరి బంతిలో విజయానికి నాలుగు పరుగులు అవసరంకాగా, ఫోర్ కొట్టి జట్టును గెలిపిస్తాడనుకున్న ధోనీ ఒక పరుగుతో సరిపుచ్చాడు. మజీవా హీరోగా నిలబడితే, ధోనీ బృందం అభిమానులను నిరాశపరచింది. వనే్డ సిరీస్‌లో జింబాబ్వేకు 3-0 తేడాతో వైట్‌వాష్ వేసిన భారత్, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌నే కోల్పోయి 0-1 తేడాతో వెనుకబడింది. సోమవారం నాటి మ్యాచ్‌ని కూడా జింబాబ్వే గెల్చుకుంటే, 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. చివరి మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. ఒకవేళ భారత్ గెలిస్తే, ఇరు జట్ల బలాబలాలు సమానమవుతాయి. చివరి మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం విజయభేరి మోగించాల్సిన అవసరం ఉండడంతో ధోనీ బృందంపై సహజంగానే ఒత్తిడి పెరుగుతున్నది. జట్టులోని యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆల్‌రౌండర్ రిషీ ధావన్ ఆస్ట్రేలియా టూర్‌లో టి-20 ఫార్మెట్‌లో రంగ ప్రవేశం చేసినప్పటికీ, ఆతర్వాత ఆదివారం మొదటిసారి మ్యాచ్ ఆడాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి, 42 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది వరకే జాతీయ జట్టులోకి వచ్చినప్పటికీ, మూడేళ్ల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ టి-20 ఫార్మెట్‌లో ఆదివారం అరంగేట్రం చేశాడు. కానీ, ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 43 పరుగులు ఇచ్చిన అతనికి మళ్లీ అవకాశం ఇవ్వడం అనుమానంగానే ఉంది. ఒకవేళ అతనిని పక్కకుపెడితే, బరీందర్ శరణ్ లేదా ధవళ్ కులకర్ణిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వనే్డల్లో అద్భుతంగా రాణించిన యుజువేంద్ర చాహల్ మొదటి టి-20లో ఆకట్టుకోలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం లేకపోలేదు.