క్రీడాభూమి

నాలుగు గోల్స్‌తో వర్గాస్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంటా క్లారా (అమెరికా), జూన్ 19: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌లో ఎడ్యుయార్డో వర్గాస్ చెలరేగిపోయి నాలుగు గోల్స్ చేయడంతో మెక్సికోపై చిలీ 7-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన చిలీ ఏకంగా వరుస గోల్స్‌తో విజృంభించగా, మెక్సికో ప్రేక్షక పాత్రను పోషించింది. వర్గాస్ నాలుగు గోల్స్‌తో కదంతొక్కితే, ఎడ్సన్ పచ్ రెండు గోల్స్ చేశాడు. స్టార్ ఆటగాడు అలెక్సిస్ సాంచెజ్ ఒక గోల్ సాధించాడు. మ్యాచ్ 16వ నిమిషంలో పచ్ ద్వారా మొదటి గోల్‌ను అందుకున్న చిలీకి 44వ నిమిషంలో వర్గాస్, 49వ నిమిషంలో సాంచెజ్ గోల్స్‌ను సంపాదించిపెట్టారు. మూడో గోల్ నమోదైన మూడు నిమిషాల్లోనే వర్గాస్ తన ఖాతాలో రెండో గోల్‌ను చేర్చుకున్నాడు. మరో ఐదు నిమిషాల్లో అతను మరో గోల్ చేశాడు. 74వ నిమిషంలో అతను తన నాలుగో గోల్‌ను సాధించడంతో చిలీ ఆధిక్యం 6-0కు పెరిగింది. 88వ నిమిషంలో పచ్ గోల్ చేశాడు. ఏ దశలోనూ మెక్సికో గట్టిపోటీనివ్వలేక చతికిలపడగా, చిలీ 7-0 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి, కొలంబియాతో సెమీ ఫైనల్‌ను ఖరారు చేసుకుంది.