క్రీడాభూమి

అత్యాచారం కేసులో భారత క్రికెటర్ అరెస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 19: భారత క్రికెటర్ ఒకరు అత్యాచారం ఆరోపణపై అరెస్టయ్యాడని జింబాబ్వే మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే, క్రికెటర్ ఎవరూ అరెస్టు కాలేదని టీమిండియా మేనేజ్‌మెంట్ తేల్చిచెప్పింది. జట్టుకు స్పాన్సర్ చేస్తున్న ఒక కంపెనీకి చెందిన ఓ ఉద్యోగిని జింబాబ్వే అధికారులు అరెస్టు చేశారని పేర్కోవడంతో అటు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారులు, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హరారేలోని ఒక హోటల్‌లో తనపై అత్యాచారం జరిపాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారత క్రికెటర్ ఒకరిని పోలీసులు అరెస్టు చేశారని జింబాబ్వే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అతనిని విడిపించడానికి జింబాబ్వేలో భారత రాయబారి మసాకుయ్ చివరి వరకూ ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ సమాచారంతో బిసిసిఐ ఉలిక్కిపడింది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఆడుతున్న టీమిండియా పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అయితే, జట్టులోని ఎవరూ ఈ సంఘటనలో లేరని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. స్పాన్సర్ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగిపై ఈ ఆరోపణలు వచ్చినట్టు వివరించింది. తాను నిర్దోషినని అతను అంటున్నాడని, అవసరమైతే డిఎన్‌ఎ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది. భారత క్రికెటర్ అరెస్టయినట్టు వచ్చిన వార్తలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కాగా, బిసిసిఐ ఈ సంఘటనపై స్పందించడానికి నిరాకరించింది. పూర్తి సమాచారం తెలియకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొంది. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి తొందరపడి ప్రకటనలు చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. తే ప్రాథమిక సమాచా రం ప్రకారం భారత క్రికెటర్ అరెస్టు కాలేదని తెలిపింది.