క్రీడాభూమి

ఇక ఎలాంటి ఆశల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియన్నా, జూన్ 19: రియో ఒలింపిక్స్‌లో తాము ప్రాతినిథ్యం వహించే అవకాశాలకు గండిపడిందని, ఇక ఎలాంటి ఆశలు లేవని రష్యా క్రీడా శాఖ మంత్రి విటాలీ ముట్కో ప్రకటించాడు. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా రష్యాను సస్పెండ్ చేసిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) దానిని కొనసాగించాలని తీర్మానించిన విషయం తెలిసిందే. సమాఖ్య నిర్ణయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ఖరారు చేసింది. రష్యాను ఒలింపిక్స్‌లో అనుమతించేది లేదని ప్రకటించింది. ఆగస్టులో ఒలింపిక్స్ జరగనుండగా, ఇప్పుడు క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించి, ఫలితాన్ని తమకు అనూలకంగా రాబట్టే అవకాశాలు రష్యాకు లేవు. ప్రస్తుత పరిస్థితులను గమనించిన తర్వాత, రియో ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొనడం అసాధ్యంగానే కనిపిస్తున్నదని ముట్కో స్పష్టం చేశాడు. ఐఎఎఎఫ్ నిర్ణయాన్ని ఐఒసి కూడా ఖాయం చేయడంతో తాము చేయగలిగింది ఏమీ ఉండదని వాపోయాడు. నిజానికి ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిబంధనల ప్రకారం రష్యాలో క్రీడా రంగం ప్రక్షాళన ప్రక్రియను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు డోపింగ్ సమస్యలు తలెత్తే ప్రమాదం లేదని, ప్రభుత్వమే అందుకు హామీ ఉంటుందని అన్నాడు. అయితే, తమ నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వాడా కమిటీ జరిపిన విచారణ, ఆతర్వాత సమర్పించిన నివేదిక ఆధారంగా తాత్కాలిక వేటు పడిన వెంటనే దిద్దుబాటు చర్యలను మొదలు పెట్టినట్టు ముట్కో చెప్పాడు. రియోలో జరిగే ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లకు తమ జాతీయ పతాకం కింద పోటీ చేసే అవకాశం చేజారిందని అన్నాడు. యుద్ధ ప్రాదిపదికన చర్యలు తీసుకొని, అథ్లెటిక్స్ రంగాన్ని ప్రక్షాళన చేశామని నిరూపించుకునే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పాడు. పుతిన్ స్వయంగా క్రీడాకారుడు కావడంతో, గతంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్ది, అవి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అన్నాడు. నిజానికి తమ దేశ అథ్లెటిక్స్ సమాఖ్య అధికారులు, అథ్లెట్లు పెద్దతప్పే చేశారని ముట్కో అంగీకరించాడు. డోపింగ్‌కు పాల్పడడం ద్వారా దేశ ప్రతిష్ఠను దిగజార్జారని ఆవేదన వ్యక్తం చేశాడు. రష్యా ప్రభుత్వమే వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందంటూ వాడా కమిటీ చేసిన ఆరోపణలో నిజం లేదని అన్నాడు.