క్రీడాభూమి

ఆరు దేశాల హాకీ టోర్నీకి సర్దార్ సింగ్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: కొంతకాలం విశ్రాంతి తీసుకున్న భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ మళ్లీ జట్టులోకి వచ్చేశాడు. ఈనెల 27 నుంచి వలెన్షియాలో ప్రారంభం కానున్న ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టుకు అతను నాయకత్వం వహిస్తాడు. సర్దార్‌తోపాటు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన డ్రాగ్ ఫ్లికర్ రూపీందర్ పాల్ సింగ్, బరీందర్ లాక్ర కూడా తిరిగి జట్టుతో చేరారు. ఇటీవల లండన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో సర్దార్ స్థానంలో గోల్‌కీపర్ శ్రీజేష్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎంతో అనుభవం ఉన్న విఆర్ రఘునాథ్, కొథాజిత్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్, బరీందర్ లాక్రల రాకతో భారత రక్షణ విభాగం పటిష్టంగా మారింది. శ్రీజేష్‌కు బ్యాకప్‌గా వికాస్ దహియా ఉంటాడు. భారత జట్టు తొలి మ్యాచ్‌ని 27న జర్మనీతో ఆడుతుంది. భారత్‌తోపాటు జర్మనీ, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, ఐర్లాండ్ జట్లు ఈ టోర్నీలో తలపడతాయి.
గత వారమే చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకం సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నదని సర్దార్ సింగ్ అన్నాడు. రియో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఆరు దేశాల టోర్నీ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఒలింపిక్స్‌కు అన్ని విధాలా సిద్ధమవుతున్నామని, ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తామని అన్నాడు. చీఫ్ కోచ్ రోలాంట్ ఆల్ట్‌మన్స్ మాట్లాడుతూ ఆరు దేశాలు పోటీపడుతున్న ఇన్విటేషనల్ హాకీ టోర్నీలో, ఆతర్వాత జరిగే రియో ఒలింపిక్స్‌లో రాణించేందుకు ఆటగాళ్లంతా శ్రమిస్తున్నారని అన్నాడు. వారి శ్రమ మంచి ఫలితాలను ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌కు
ఎంపికైన భారత జట్టు ఇదే..

గోల్‌కీపర్లు: శ్రీజేష్ (వైస్-కెప్టెన్), వికాస్ దహియా.
డిఫెండర్లు: రూపీందర్ పాల్ సింగ్, విఆర్ రఘునాథ్, కొథాజిత్ సింగ్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్ర.
మిడ్‌ఫీల్డర్లు: దనీష్ ముజ్‌తబా, చింగ్లెన్‌సనా సింగ్, మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్ (కెప్టెన్), ఎస్‌కె ఉతప్ప, దేవీందర్, సునీల్ వాల్మికి, హర్జీత్ సింగ్.
ఫార్వర్డ్స్: తల్వీందర్ సింగ్, ఎస్వీ సునీల్, ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, నికిన్ తిమ్మయ్య.