క్రీడాభూమి

ముక్కోణపు వనే్డ సిరీస్ ఆసీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జిటౌన్ (బార్బడాస్), జూన్ 20: ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్ధం కారణంగా రద్దయింది. ఇరు జట్లకు చెరి రెండు పాయింట్లు లభించాయి. అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు దిగి, ఒక ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. పలుమార్లు పరిస్థితిని సమీక్షించి, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు పాయింట్లు సంపాదించిన దక్షిణాఫ్రికా మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, ఆసీస్ 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, ఆసీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు కావడం ఈ టోర్నీలో మూడో జట్టుగా ఉన్న వెస్టిండీస్‌కు లాభించనుంది. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఎనిమిది పాయింట్లు సంపాదించిన ఈ జట్టు, చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని సాధిస్తా ఫైనల్‌కు వెళుతుంది.

అవుట్ ఫీల్డ్‌ను పరిశీలిస్తున్న అధికారులు