క్రీడాభూమి

అలాంటి తప్పు మళ్లీ చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 21: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్‌ను 2005లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి సిఫారసుచేసి చేతులు కాల్చుకున్నానని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంగీకరించాడు. ప్రస్తుతం టీమిండియాకు తదుపరి కోచ్‌ను నియమించే బాధ్యతను మరోసారి నెత్తికెత్తుకున్న గంగూలీ అలాంటి తప్పును మళ్లీ చేయబోనని స్పష్టం చేశాడు. టీమిండియా కోచ్‌గా చాపెల్ నియమితుడైన కొన్నాళ్ల తర్వాత అతనికీ గంగూలీకి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడంతో భారత జట్టు సారథ్య బాధ్యతలకు ‘బెంగాల్ టైగర్’ దూరమవ్వాల్సి వచ్చిన విషయం విదితమే. అయితే గంగూలీ మంగళవారం కోల్‌కతాలో తన పుస్తకం ‘ఎ సెంచరీ ఇజ్ నాట్ ఎనఫ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘గతంలో భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌ను ఎంపికచేసే అవకాశం లభించినప్పుడు చాపెల్‌ను ఇంటర్వ్యూ చేసి ఆ పదవికి ఆయన పేరును సిఫారసు చేయడం ద్వారా తప్పు చేశా. ఆ తర్వాత ఆయనతో పొసగక చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మరోసారి టీమిండియాకు తదుపరి కోచ్‌ను ఎంపికచేసే అవకాశం పొందిన నేను మళ్లీ అలాంటి తప్పును చేయదల్చుకోలేదు’ అని స్పష్టం చేశాడు. ఈసారి కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ పొరపాటుకు తావులేకుండా సవ్యంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నానని గంగూలీ చెప్పాడు. ‘ప్రస్తుతం కోచ్ ఎంపిక విషయంలో అదృష్టవశాత్తూ నాకు టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్, వివిఎస్.లక్ష్మణ్‌తో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే అండగా ఉన్నారు. మేమంతా కలసి టీమిండియాకు తదుపరి కోచ్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేయగలమని ఆశిస్తున్నా’ అని గంగూలీ తెలిపాడు. భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించాలన్న ఆలోచన రెండేళ్ల క్రితమే తనకు కలిగిందని గంగూలీ అంగీకరించాడు. ‘వాస్తవానికి టీమిండియా కోచ్‌గా ఎందుకు బాధ్యతలు చేపట్టకూడదని రెండేళ్ల క్రితమే ఆలోచించిన నేను ప్రస్తుతం ఆ ఆలోచనను పక్కనపెట్టి ఇప్పుడు మరొకరిని ఆ పదవికి ఎంపిక చేస్తుండటం విచిత్రం. భారత జట్టు కోచ్ పదవిని చేపట్టేందుకు నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలో పాల్గొనలేదు. కానీ ఏదో ఒక రోజు ఆ పని చేయాలని ఆశిస్తున్నా. జీవితంలో దేనికీ హామీ ఉండదు. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. బెంగాల్ క్రికెట్ సంఘానికి నేను అధ్యక్షుడిని అవుతానని, ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌ను నేను నిర్వహిస్తానని ఎవరూ అనుకోలేదు. జీవితమంటే అదే. ఏమి జరిగినా ఎదుర్కోవాల్సిందే’ అని గంగూలీ తెలిపాడు.