క్రీడాభూమి

రాణించిన షమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 1: దేశంలో తొలిసారిగా ఇక్కడి ఈడెన్‌గార్డెన్‌లో ఫ్లడ్‌లైట్ల మద్య నిర్వహించిన పింక్‌బాల్ నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 296 పరుగుల తేడాతో భవానీపూర్ క్లబ్ జట్టును ఓడించి విజయం సాధించింది. మోహన్ బగాన్ జట్టులో టీమిండియా ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్‌లలోను చక్కగా రాణించి ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటుగా మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును సైతం దక్కించుకున్నాడు. తొలిఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు సాదించిన షమీ రెండో ఇన్నింగ్స్‌లోను 82 పరుగులు రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా భవానీపూర్ క్లబ్ రెండో ఇన్నింగ్స్‌లో మోహన్ బగాన్ పార్ట్‌టైమ్ బౌలర్‌గా రంగంలోకి దిగిన వివేక్ సింగ్ కేవలం 32 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు కేవలం 199 పరుగులే ఆలౌట్ అయింది.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సూపర్‌లీగ్ ఫైనల్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ని వచ్చే అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే అధికారిక తొలి డే/నైట్ మ్యాచ్‌కి సన్నాహకంగా పింక్ బాల్‌తో నిర్వహించారు. మోహన్ బగాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌట్ కాగా, భవానీపూర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, మోహన్ బగాన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన 349 పరుగులకు సమాధానంగా సోమవారం మూడో రోజు ఆట ముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన భవానీపూర్ క్లబ్ నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన గంటకే 199 పరుగులకు ఆలౌట్ అయింది.