క్రీడాభూమి

టీమిండియా కోచ్ పదవికి ఇంటర్వ్యూలు సమాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 21: దీర్ఘ కాలం నుంచి ఖాళీగా ఉన్న టీమిండియా ప్రధాన కోచ్ పదవిని భర్తీ చేసేందుకు అభ్యర్థి కోసం చాలా కాలం నుంచి జరుగుతున్న అనే్వషణ తుది దశకు చేరుకుంది. ఈ పదవికి తగిన అభ్యర్థిని సిఫారసు చేసేందుకు బిసిసిఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) మంగళవారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు అనిల్ కుంబ్లే, రవిశాస్ర్తీ సహా పలువురు ఇతర అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) సహా సిఎసిలో సభ్యులుగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఆటగాడు వివిఎస్.లక్ష్మణ్ ఏడుగురు అభ్యర్థులను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు. భారత క్రికెట్ జట్టును మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు తాము రూపొందించుకున్న ప్రణాళికలను సదరు అభ్యర్థులు ఇంటర్వ్యూలో వివరించారు. కుంబ్లే వ్యక్తిగతంగా ఈ ఇంటర్వ్యూకి హాజరవగా, ప్రస్తుతం విదేశంలో ఉన్న టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ ‘స్కైప్’ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అలాగే ఆస్ట్రేలియాకి చెందిన మాజీ ఆటగాళ్లు స్టూవర్ట్ లా, టామ్ మూడీతో పాటు గతంలో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ జట్లకు కోచ్‌గా సేవలు అందించిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండీ మోలెస్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎసికి తమ ప్రజెంటేషన్లు ఇచ్చారు.
అయితే, టీమిండియా కోచ్ పదవి కోసం భారత మాజీ ఆటగాళ్లు లాల్‌చంద్ రాజ్‌పుట్, ప్రవీణ్ ఆమ్రేలను కూడా ఇంటర్వ్యూ చేసిన సిఎసి, ఈ పదవి కోసం పోటీపడుతున్న ప్రధాన అభ్యర్థుల్లో ఒకడైన మరో మాజీ ఆటగాడు, బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్‌ను మాత్రం ఈ ఇంటర్వ్వూకి పిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంటర్వ్యూకి హాజరు కావలసిందిగా సిఎసి నుంచి తనకు ఆహ్వానం రాలేదని సందీప్ పాటిల్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.
ప్రక్రియ ముగిసింది : గంగూలీ
ఇదిలావుంటే, ఈ ఇంటర్వూలకు సంబంధించిన సమగ్ర నివేదికను సిఎసి బుధవారం లోగా బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కేకి సమర్పించాలని భావిస్తోంది. కనుక భారత క్రికెట్ జట్టుకు తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్న దానిపై బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ నెల 24వ తేదీన తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. టీమిండియా కోచ్ పదవికి సంబంధించిన ఇంటర్వ్యూల ప్రక్రియ మంగళవారంతో ముగుస్తుందని, ఇక ఎవరినీ ఇంటర్వ్యూలు చేసేది లేదని సిఎసి సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ‘ఈ పదవికి తగిన వ్యక్తిని సిఫారసు చేసేందుకు దాదాపు 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాం. వీరిలో మేము సూచించే అభ్యర్థి ఎవరన్నదీ ఖరారు చేసి బుధవారం లోగా బిసిసిఐకి నివేదిక సమర్పిస్తాం’ అని గంగూలీ చెప్పాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో ఎంత పస ఉందన్నదీ గంగూలీ వెల్లడించలేదు.
టీమిండియా చీఫ్ కోచ్ పదవి కోసం బిసిసిఐ తన వెబ్‌సైట్‌లో దరఖాస్తులను ఆహ్వానించడంతో భారత్‌తో పాటు విదేశాలకు చెందిన 57 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత ఆ జాబితాను 21 మందికి కుదించిన విషయం విదితమే.
ఏదిఏమైనప్పటికీ అంతర్జాతీయ టెస్టులు, వనే్డ మ్యాచ్‌లలో కలిపి అత్యధిక వికెట్లు (మొత్తం 956 వికెట్లు) కైవసం చేసుకున్న భారత ఆటగాడిగా చరిత్రకెక్కిన అనిల్ కుంబ్లేతో పాటు గతంలో భారత జట్టుకు 18 నెలల పాటు డైరెక్టర్‌గా సేవలు అందించి వనే్డ, టి-20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాను సెమీఫైనల్స్‌కు చేర్చిన రవిశాస్ర్తీ ఈ పదవి కోసం ప్రధానంగా రేసులో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

చిత్రం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు మంగళవారం కోల్‌కతాలో హోటల్‌కు వెళ్తున్న సౌరవ్ గంగూలీ