క్రీడాభూమి

ఒలింపిక్స్ రిలే కోసం చిరుత కాల్చివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనాస్ (బ్రెజిల్), జూన్ 22: బ్రెజిల్ అధికారుల అత్యుత్సాహం ఒక చిరుత పులిని బలిగొంది. స్థానిక జూలో ఒలింపిక్స్ రిలేను నిర్వహించడం, అందు కోసం జుమా అనే చిరుతను తీసుకొచ్చి ఫొటో సెషన్‌ను నిర్వహించడం, చివరికి దానిని కాల్చిచంపడం సంచలనం రేపగా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు మాసంలో జరిగే ఒలింపిక్స్‌కు బ్రెజిల్ ఒలింపిక్ నిర్వాహణ కమిటీ పలు కార్యక్రమాలను చేపట్టింది. సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్న టార్చ్ రిలే మనాస్ చేరుకోగా, అక్కడ అధికారులు, అభిమానులు సాదర ఆహ్వానం పలికారు. ఈసారి బ్రెజిల్ ఒలింపిక్స్‌కు ‘గింగా’ అని పేరుపెట్టిన చిరుత పులిని మస్కట్‌గా ఎంపిక చేశారు. రిలే మనాస్‌కు రాగానే, అక్కడి జూలోని జుమా అనే చిరుతను తీసుకొచ్చి ఫొటో సెషన్‌ను నిర్వహించారు. టార్చిని పట్టుకొని, జుమా పక్కనే కూర్చొని పలువురు జవాన్లు, అధికారులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు. ఈ తతంగం కొనసాగుతున్న సమయంలోనే చిరుత గొలుసు తెంపుకోవడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. మనుషలపై జుమా ఎక్కడ దాడి చేస్తుందోనని అనుమానించిన ఓ జవాను తుపాకీతో దానిని కాల్చి చంపాడు. ఈ సంఘటన మొత్తం టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో స్పష్టంగా కనిపించడంతో, జీవ కారుణ్య సంఘాలు మండిపడుతున్నాయి. సామాన్యులు కూడా బ్రెజిల్ అధికారుల నిర్వాకాన్ని తప్పుపడుతున్నారు. జూలోకి వెళ్లి, గందరగోళం సృష్టించి, చివరికి చిరుతను కాల్చి చంపడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు.