క్రీడాభూమి

చచ్చీచెడీ గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 22: జింబాబ్వేతో జరిగిన చివరి, మూడో టి-20ని అతి కష్టం మీద గెల్చుకున్న టీమిండియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 138 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి వరకూ ప్రయత్నించిన జింబాబ్వే మూడు పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ 20 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను మన్దీప్ సింగ్ (4) రూపంలో కోల్పోయింది. అతను డొనాల్డ్ తిరిపానో బౌలింగ్‌లో టిమిసెన్ మరుమాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నివెల్లె మజీవా వేసిన ఐదో ఓవర్‌లోని రెండు వరుస బంతుల్లో ఓపెనర్ లోకేష్ రాహుల్ (22), మనీష్ పాండే (0) వికెట్లు కూలడంతో భారత్ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేదార్ జాదవ్ జట్టుకు అండగా నిలిచాడు. అంబటి రాయడు 26 బంతుల్లో 20 పరుగులు చేసి గ్రేమ్ క్రెమర్ బౌలింగ్‌లో ఎల్టన్ చిగుంబురాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోనీ తొమ్మిది పరుగులు చేసి డొనాల్డ్ తిరిపానో బౌలింగ్‌లో కీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 42 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసిన జాదవ్‌ను ఎల్టన్ చిగుంబురా క్యాచ్ అందుకోగా డొనాల్డ్ తిరిపానో అవుట్ చేశాడు. చివరిలో అక్షర్ పటేల్ (20), ధవళ్ కులకర్ణి (1) నాటౌట్‌గా నిలవగా, భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 138 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో డొనాల్డ్ తిరిపానో 20 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
చివరి వరకూ పోరాటం
విజయానికి 139 పరుగులు సాధించాల్సిన జింబాబ్వే చివరి వరకూ తన ప్రయత్నాన్ని కొనసాగించింది. అసాధారణ పోరాట పటిమను చూపింది. అయితే, చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడికి లోనైన కారణంగా మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఐదు పరుగులు చేసిన చాము చిబాభాను యుజువేంద్ర చాహల్ క్యాచ్ అందుకోగా బరీందర్ శరణ్ అవుట్ చేయడంతో జింబాబ్వే 17 పరుగుల స్కోరు వద్ద మొదటి వికెట్ చేజార్చుకుంది. రెండో వికెట్‌కు ఉసి సిబాండాతో కలిసి 40 పరుగులు జోడించిన హామిల్టన్ మసకజా (15)ను అక్షర్ పటేల్ ఎల్‌బిగా అవుట్ చేశాడు. మరో మూడు పరుగుల తర్వాత సిబాండా వికెట్ కూడా కూలింది. అతను 23 బంతుల్లో 28 పరుగులు చేసి ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. పీటర్ మూర్ (26) కూడా జింబాబ్వేను గెలిపించాలన్న పట్టుదలతో ఆడినప్పటికీ చాహల్ బౌలింగ్‌లో మన్దీప్ సింగ్‌కు దొరికిపోయాడు. మాల్కం వాలర్ 10 పరుగులు చేసి వెనుదిరగ్గా, చివరిలో ఎల్టన్ చిగుంబురా, టిమిసెన్ మరుమా వీరోచిత పోరాటాన్ని కొనసాగించారు. అయితే, చివరి బంతిలో చిగుంబురా (16) అవుటయ్యాడు. మరుమా 13 బంతుల్లోనే 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 135 పరుగులు సాధించి, మూడు పరుగుల తేడాతో ఓడింది.
* విజయానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరంకాగా, జింబాబ్వేను గెలిపించేందుకు చెమటోడుస్తున్న ఎల్టన్ చిగుంబురా, టిమిసెన్ మరుమా క్రీజ్‌లో ఉన్నారు. బరీందర్ శరణ్ వేసిన ఆ ఓవర్‌లో మొదటి బంతిని మరుమా సిక్స్‌గా మలచడంతో జింబాబ్వే ఆశలు చిగురించాయి. రెండో బంతిని శరణ్ వైడ్‌గా వేయడంతో జింబాబ్వేకు ఒక అదనపు పరుగు, ఓ అదనపు బంతి లభించాయి. తర్వాతి ప్రయత్నంలో అతను నోబాల్ వేయగా మరుమా దానిని ఫోర్‌గా కొట్టాడు. రెండు బంతులు వృథాకాగా, మూడోసారి రెండో బంతిని వేసిన శరణ్‌కు ఊరట లభించింది. ఆ బంతిలో మరుమా ఒక్క పరుగు కూడా చేయలేదు. మూడో బంతిని కూడా అతను రక్షణాత్మకంగా ఆడి, నాలుగో బంతిలో ఒక పరుగు చేశాడు. దీనితో స్ట్రయికింగ్ చిగుంబురాకు లభించింది. అతను తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్ కొట్టాడు. గెలవాలంటే చివరి బంతిలో ఫోర్ కొట్టాల్సి ఉండగా, భారీ షాట్‌కు ప్రయత్నించిన చిగుంబురా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో అవుటయ్యాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కేదార్ జాదవ్.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: బరీందర్ శరణ్.

స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ బి నివెల్లె మజీవా 22, మన్దీప్ సింగ్ సి టిమిసెన్ మరుమా బి డొనాల్డ్ తిరిపానో 4, అంబటి రాయుడు సి ఎల్టన్ చిగుంబురా బి గ్రేమ్ క్రెమర్ 20, మనీష్ పాండే రనౌట్ 0, కేదార్ జాదవ్ సి ఎల్టన్ చిగుంబురా బి డొనాల్డ్ తిరిపానో 58, మహేంద్ర సింగ్ ధోనీ బి డొనాల్డ్ తిరిపానో 9, అక్షర్ పటేల్ 20 నాటౌట్, ధవళ్ కులకర్ణి 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 138.
వికెట్ల పతనం: 1-20, 2-27, 3-27, 4-76, 5-93, 6-125.
బౌలింగ్: టెండయ్ చతారా 4-1-34-0, డొనాల్డ్ తిరిపానో 4-0-20-3, నెవిల్లె మజీవా 4-0-32-1, చాము చిబాభా 4-0-19-0, గ్రేమ్ క్రెమర్ 4-0-32-1.
జింబాబ్వే ఇన్నింగ్స్: చాము చిబాభా సి యుజువేంద్ర చాహల్ బి బరీందర్ శరణ్ 5, హామిల్టన్ మసకజా ఎల్‌బి అక్షర్ పటేల్ 15, ఉసి సిబాండా ఎల్‌బి ధవళ్ కులకర్ణి 28, పీటర్ మూర్ సి మన్దీప్ సింగ్ బి యుజువేంద్ర చాహల్ 26, మాల్కం వాలర్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి ధవళ్ కులకర్ణి 10, ఎల్టన్ చిగుంబురా సి యుజువేంద్ర చాహల్ బి బరీందర్ శరణ్ 16, టిమిసెన్ మరుమా నాటౌట్ 23, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135.
వికెట్ల పతనం: 1-17, 2-57, 3-60, 4-86, 5-104, 6-135.
బౌలింగ్: బరీందర్ శరణ్ 4-1-31-2, ధవళ్ కులకర్ణి 4-0-23-2, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-23-0, అక్షర్ పటేల్ 4-0-18-1, యుజువేంద్ర చాహల్ 4-0-32-1.