క్రీడాభూమి

రిటైర్మెంట్ యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రానంత మాత్రాన తాను అంతర్జాతీయ బాక్సింగ్ నుంచి రిటైర్ కావాలని అనుకోవడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. రియోకు వెళ్లే అవకాశం లేదన్న విషయాన్ని భారత బాక్సింగ్ అడ్‌హాక్ కమిటీ ద్వారా తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డానని పిటిఐతో మాట్లాడుతూ ఆమె చెప్పింది. రియోకు వెళ్లే అవకాశం రానందుకు నిరాశ చెందినప్పటికీ, కెరీర్‌ను ముగించాలన్న ఆలోచన తనకు లేదని తేల్చిచెప్పింది. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని, బాక్సింగ్‌ను కొనసాగిస్తానని తెలిపింది. సహజంగా వైల్డ్‌కార్డ్ రావడం చాలా కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అయితే, తన గత రికార్డును దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం ఇస్తారని ఊహించానని పేర్కొంది. తన రిటైర్మెంట్ గురించి చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని కోమ్ తెలిపింది. ప్రస్తుతానికి తాను బాక్సింగ్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నానని, భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేనని అన్నది. తనకు ఆశాజనకమైన కెరీర్ ఉందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.