క్రీడాభూమి

యూరో 2016 సాకర్ బ్రాడీ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిల్లే (ఫ్రాన్స్), జూన్ 23: రాబీ బ్రాడీ అసాధారణ ప్రతిభ యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇటలీతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఈ జట్టు 1-0 ఆధిక్యంతో గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి దాదాపుగా చివరి వరకూ ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఒకానొక దశలో పెనాల్టీ షూటౌట్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, 85వ నిమిషంలో బ్రాడీ చక్కటి గోల్‌తో ఐర్లాండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అదే తేడాతో ఇటలీని ఓడించిన ఐర్లాండ్ ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో స్థానం కోసం ఈ జట్టు ఇంగ్లాండ్‌ను ఢీ కొంటుంది.
మరో మ్యాచ్‌లో స్వీడన్‌పై 1-0 తేడాతో నెగ్గిన బెల్జియం ప్రీ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌తో పోరును ఖాయం చేసుకుంది. మ్యాచ్ 84వ నిమిషంలో రజ్డా నైనగొలాన్ చేసిన గోల్ బెల్జియంను విజయపథంలో నడిపించింది. మరో మ్యాచ్‌లో ఐస్‌లాండ్ 2-1 తేడాతో ఆస్ట్రియాపై గెలిచింది. ఈ జట్టు తరఫున జాన్ డవోయ్ బూవార్సన్, అర్నోస్ ఇంగ్వీ ట్రాస్టాసన్ గోల్స్ చేశారు. ఆస్ట్రియాకు అలెక్సాంట్రో స్క్ఫా ద్వారా గోల్ లభించింది. కాగా, ప్రీ క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌ను ఐస్‌లాండ్ ఢీ కొంటుంది. హంగరీ, పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెల్జియంతో హంగరీ, క్రొయేషియాతో పోర్చుగల్ ప్రీ క్వార్టర్స్ పోరాటాలను ఖాయం చేసుకున్నాయి. ఇలావుంటే, మిగతా ప్రీ క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌తో పోలాండ్, వేల్స్‌తో నార్తన్ ఐర్లాండ్, జర్మనీతో స్లొవేకియా, స్పెయిన్‌తో ఇటలీ తలపడతాయి.

చిత్రం రాబీ బ్రాడీ