క్రీడాభూమి

ప్రచారాన్ని ఇష్టపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: తాను ప్రచారాన్ని ఇష్టపడనని, తనకు అప్పగించిన బాధ్యతను ఎలాంటి హంగామా లేకుండా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా ఎంపికైన మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే అన్నాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ గతంలో కోచ్‌లుగా వ్యవహరించిన జాన్ రైట్, గారీ కిర్‌స్టెన్ కూడా ఈ విధంగా తెరవెనుకే ఉండేవారని, తనదీ అదే సిద్ధాంతమని పేర్కొన్నాడు. 2000 నుంచి 2005 వరకు టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉన్న జాన్ రైట్ ఆతర్వాత 2013-14 మధ్యకాలంలో ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. అదే కాలంలో ఆ జట్టుకు మెంబర్‌గా కుంబ్లే సేవలు అందించాడు. జాన్ రైట్ కోచ్‌గా ఉన్నప్పుడు ఎక్కువ కాలం తాను క్రికెటర్‌గా అతనిని చాలా దగ్గర నుంచి పరిశీలించానని కుంబ్లే అన్నాడు. అతని ప్రభావం తనపై ఎక్కువగా ఉందని చెప్పాడు. ముంబయి ఇండియన్స్‌కు మెంబర్‌గా ఉన్నప్పుడు తాను జాన్ రైట్‌ను పిలిపించుకున్నానని, అతనితో తనకు ఉన్న అవగాహనే అందుకు కారణమని కుంబ్లే తెలిపాడు. కిర్‌స్టెన్ భారత జట్టుకు 2008 నుంచి 2011 వరకు కోచ్‌గా వ్యవహరించాడు. అతను కోచ్‌గా వచ్చిన ఏడాదే క్రికెటర్‌గా కుంబ్లే చివరి టెస్టు ఆడాడు. తనకు కిర్‌స్టెన్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలోనే పరిచయం ఉందని కుంబ్లే అన్నాడు. అది చాలా తక్కువ సమయమేనని, అయితే, కిర్‌స్టెన్ అనుసరించిన విధానాలు తనను ప్రభావితం చేశాయని చెప్పాడు. జాన్ రైట్, కిర్‌స్టెన్ ఎన్నడూ తెరపైకి రాలేదని, నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుంటూ వెళ్లేవారని అన్నాడు. తాను కూడా అదే విధానాన్ని అనుసరిస్తానని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ జట్టు వ్యూహాలను ఖరారు చేయడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి గణాంక వివరాలు అత్యవసరమని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. అదే విధంగా జట్టు నిలకడగా రాణించడం ప్రధానమని అన్నాడు. పోటీతత్వంతో కూడిన ఫిట్నెస్ సమస్యలేని జట్టును సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఎప్పుడైనా జట్టే ముఖ్యమని, కోచ్‌ది రెండో స్థానమేనని కుంబ్లే వ్యాఖ్యానించాడు. అవసరాలకు తగినట్టు జట్టును సిద్ధం చేసుకోవడమే కోచ్ కర్తవ్యమని అన్నాడు. కోచ్ బాధ్యత కేవలం మైదానంలో జట్టు పరిస్థితిని గమనించి, సూచనలు ఇవ్వడం మాత్రమే కాదని స్పష్టం చేశాడు. ఆటగాళ్లలో వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నాడు. అదే విధంగా వారితో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కూడా కోచ్ బాధ్యతేనని చెప్పాడు. భారత జట్టులో ఇప్పటికే సమర్థులైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని, వారికి ప్రత్యేకించిన సూచనలు చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే, నిలకడగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయని, ఆ దిశగా తాను కృషి చేస్తానని అన్నాడు. తాను నమ్మిన సిద్ధాంతాలను, వ్యూహాలను ఆటగాళ్లకు వివరించి, వారి మద్దతు సంపాదించుకుంటానని కుంబ్లే చెప్పాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో తాను ఇప్పటికే మాట్లాడినట్టు చెప్పాడు. జూలై నుంచి ఆగస్టు వరకు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్‌కు భారత్ వెళ్లనున్న నేపథ్యంలో తాను కోహ్లీతో కొద్దిసేపు చర్చించానని అన్నాడు. అదే విధంగా భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతోనూ తాను ఫోన్‌లో మాట్లాడినట్టు కుంబ్లే చెప్పాడు.