క్రీడాభూమి

వింబుల్డన్ మెయిన్ డ్రా ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 24: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ డ్రా ఖరారైంది. ముందుగా ఊహించిన విధంగా ఫలితాలు వెల్లడైతే, సెమీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, కెరీర్‌లో అత్యధికంగా 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న రోజర్ ఫెదరర్ మధ్య మ్యాచ్ ఉంటుంది. మొట్టమొదటి క్యాలెండర్ గ్రాండ్ శ్లామ్‌ను కైవసం చేసుకునే ఊపుమీద ఉన్న జొకోవిచ్‌కు టైటిల్ గెలిచే అవకాశాలున్నాయని విశే్లషకుల అంచనా. కాగా, డ్రా ప్రకారం చూస్తే, 2013 వింబుల్డన్ చాంపియన్, రెండో సీడ్ ఆండీ ముర్రే సెమీ ఫైనల్‌లో నాలుగోసీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కాను ఎదుర్కొంటాడు. గత నెల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా జొకోవిచ్ కెరీర్ గ్రాండ్ శ్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను అందుకున్న అతను వింబుల్డన్‌లో, ఆతర్వాత యుఎస్ ఓపెన్‌లో టైటిళ్లను కైవసం చేసుకుంటే, క్యాలండర్ శ్లామ్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదిస్తాడు. 1938లో డాన్ బడ్జి తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకున్నాడు. అనంతరం రాడ్ లెవర్ 1962లో అమెచ్యూర్ ఆటగాడిగా, 1969లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి వింబుల్డన్‌లో జొకోవిచ్ మొదటి మ్యాచ్‌ని వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన జేమ్స్ వార్డ్‌తో ఆడతాడు. నాలుగో రౌండ్‌లో అతనికి మిలోస్ రవోనిక్ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇలావుంటే, 34 ఏళ్ల స్విట్జర్లాండ్ వీరుడు ఫెదరర్ కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగించనున్నాడు. గత సీజన్‌లో చాలా భాగం గాయాల సమస్యతో అల్లాడిన అతను ఈఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వింబుల్డన్‌లో అతను మొదటి రౌండ్‌లో అతను అర్జంటీనాకు చెందిన గైడో పెల్లాతో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతనికి జపాన్ స్టార్ కెయ్ నిషికోరి ఎదురయ్యే అవకాశం ఉంది.
స్ట్ఫె రికార్డు దిశగా సెరెనా
ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కోసం ప్రయత్నించనుంది. అదే సమయంలో ఆమె కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకోవడం ద్వారా స్ట్ఫె గ్రాఫ్ రికార్డును సమం చేసే దిశగా ముందడుగు వేయాలన్న పట్టుదలతో ఉంది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో గార్బినె ముగురుజా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన సెరెనా వింబుల్డన్‌లో అదే పొరపాటును పునరావృతం చేయకుండా ఉండేందుకు శ్రమిస్తున్నది. మెయిన్ డ్రాను గమనిస్తే ఆమె సెమీ ఫైనల్‌లో అగ్నీస్కా రద్వాన్‌స్కాను ఎదుర్కునే అవకాశం ఉంది. ఇటలీకి చెందిన కామిలా గియోర్గీతో తొలి రౌండ్‌లో ఆడనున్న ముగురుజా సెమీస్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్‌తో తలపడవచ్చు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమెకు వీనస్ విలియమ్స్ ఎదురుకావచ్చు. మొత్తం మీద ఈసారి కూడా వింబుల్డన్‌లో సీడెడ్ల హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

వైదొలగిన అజరెన్కా
లండన్: వింబుల్డన్ టోర్నీ నుంచి ప్రపంచ మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెన్కా వైదొలగింది. రెండు పర్యాయాలు వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేకున్న ఆమె కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నది. నొప్పి ఇంకా తగ్గకపోవడంతో ఈసారి పోటీలకు హాజరుకావడం కావడం లేదని ఆమె సమాచారం పంపిందని టోర్నమెంట్ నిర్వాహకులు ప్రకటించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె మొదటి రౌండ్ రౌండ్ మ్యాచ్‌ని కరిన్ నాప్‌తో ఆడాల్సి ఉండింది. అయితే, మోకాలి నొప్పి వేధించడంతో ఆమె మ్యాచ్‌కి హాజరుకాలేదు. అప్పటి సమస్య ఇంకా పూర్తి తగ్గకపోవడంతో, వింబుల్డన్‌కు దూరం కావాల్సి వచ్చింది. గతంలో రెండు పర్యాయాలు వింబుల్డన్‌లో సెమీ ఫైనల్ వరకూ చేరిన అజరెన్కా ఈ విధంగా టోర్నీ నుంచి వైదొలగడం రెండోసారి.