క్రీడాభూమి

విదేశాల్లో మినీ ఐపిఎల్విదేశాల్లో మినీ ఐపిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, జూన్ 24: విదేశాల్లో మినీ ఐపిఎల్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. టోర్నీ స్వరూపం ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, రెండు వారాల్లో దీనిని ముగించాలని బిసిసిఐ భావిస్తోంది. అమెరికాలో లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఈ టోర్నీని నిర్వహిస్తామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపాడు. బోర్డు పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో టోర్నీని నిర్వహిస్తామని అన్నాడు. ఐపిఎల్‌లో ఆడే ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీకి మినీ ఐపిఎల్ లేదా ఓవర్‌సీస్ ఐపిఎల్‌గా పిలుస్తారని చెప్పాడు. ఐపిఎల్‌తో పోలిస్తే ఈ టోర్నమెంట్ నిడివి తక్కువగా ఉంటుందని తెలిపాడు. హోం గ్రౌండ్‌లో కొన్ని, ప్రత్యర్థి జట్ల వేదికలపై కొన్ని మ్యాచ్‌లను ఐపిఎల్‌లోని జట్లు ఆడతాయని, కానీ, మినీ ఐపిఎల్‌లో ఆ విధమైన విభజన ఉండదని ఠాకూర్ వివరించాడు. ఐపిఎల్‌ను విదేశాల్లో ఆడడం కొత్తమే కాదని, 2009లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి టోర్నమెంట్ దక్షిణాఫ్రికాలో జరిగిందని చెప్పాడు. యుఎఇలోనూ ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఐపిఎల్ సుమారు రెండు నెలలు కొనసాగుతుందని, మినీ ఐపిఎల్‌ను రెండు వారాల్లో ముగించాలని అనుకుంటున్నామని చెప్పాడు.
కుంబ్లే నియామకానికి గ్రీన్ సిగ్నల్
భారత జాతీయ కోచ్‌గా అనీల్ కుంబ్లే నియామకానికి బిసిసిఐ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న కుంబ్లే ఏడాదిపాటు ఆ పదవిలో ఉంటాడని పాలక మండలి సమావేశం తీర్మానించింది. అండర్-19 క్రికెటర్లకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఈ విభాగంలోని ఒక క్రికెటర్ కేవలం ఒకసారి మాత్రమే అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హుడని ప్రకటించింది. అంతేగాక, ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఒక క్రికెటర్ రెండు సీజన్లు మాత్రమే అందులో కొనసాగాలని తీర్మానించింది.
కీలక నిర్ణయాలు
బిసిసిఐ పాలక మండలి శుక్రవారం ముగిసిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరపాలని నిర్ణయించింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల మార్కెటింగ్‌కు బిసిసిఐ, దాని అనుబంధ సంఘాలు సమష్టిగా కృషి చేస్తాయని పేర్కొంది. ఈ సీజన్‌లో టీమిండియా 13 టెస్టు మ్యాచ్‌లు ఆడనుండడంపై హర్షం వ్యక్తం చేసింది. తటస్థ వేదికలపై రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను నిర్వహించాలని టెక్నికల్ కమిటీ చేసిన సిఫార్సులను బిసిసిఐ ఆమోదించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్తగా టి-20 లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని తీర్మానించింది. మొదటి దశలో అన్ని అంతర్ మండల పోటీలు జరుగుతాయని, ఆతర్వాత ఒక్కో జట్టు ఇతర జోన్స్ నుంచి ఎంపిక చేసిన జట్లతో పోటీ పడుతుందని వివరించింది. అనుబంధ సంఘాలకు ఏటా ఉత్తమ వెబ్‌సైట్, ఉత్తమ ఫేస్‌బుక్ పేజ్, ఉత్తమ ట్విటర్ అక్కౌంట్, ఉత్తమ ఇన్‌స్టాగ్రామ్, ఉత్తమ మీడియా సౌకర్యాలు, ఉత్తమ మీడియా నిర్వాహణ తదితర విభాగాల్లో అవార్డులు ఇవ్వాలని బిసిసిఐ పాలక మండలి నిర్ణయించింది.