క్రీడాభూమి

యూరో 2016 క్వార్టర్స్‌కు పోలాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాయర్, జూన్ 25: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో పోలాండ్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో పెనాల్టీ షూటౌట్ అనివార్యంకాగా, స్విట్జర్లాండ్‌పై పోలాండ్ 5-4 తేడా తో విజయం సాధించింది. అంతకు ముందు ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ. మ్యాచ్ 39వ నిమిషంలో పోలాండ్‌కు జాకుబ్ బ్లాజికోవ్‌స్కీ గోల్‌ను సాధించిపెట్టగా, 82వ నిమిషంలో హెండ్రాన్ షాకిరీ స్విస్‌కు ఈక్వెలైజర్‌ను అందించాడు. ఫలితం తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పోలాండ్ త రఫున లెవాండావ్‌స్కీ, మిలిక్, గ్లిక్, బ్లాజికోవ్‌స్కీ, క్రిచోవియాక్ తమతమ ప్రయత్నాలు సఫలమయ్యారు. దీనితో ఆ జట్టుకు ఐదు గోల్స్ లభించాయ. స్విస్ తరఫున లిస్టెనెర్, షాకిరీ, చార్, రోడ్రిగెజ్ పెనాల్టీ షూటౌ ట్‌ను సమర్థంగా పూర్తి చేశారు. అయతే, గ్రానిట్ జాకా కొట్టిన బంతిని పోలాండ్ గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నారు. స్విస్‌కు నాలుగు గోల్స్ లభించడంతో ఆ జట్టు ఒక గోల్ తేడాతో ఓటమిపాలైంది.