క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, జూన్ 1: రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్ బాక్సర్లు అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకూ అమెచ్యూర్స్ లేదా ఔత్సాహికులకు మాత్రమే అవకాశం ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ప్రొఫెషన్లు పోటీపడడానికి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 88 సభ్య దేశాలున్న ఈ సంఘం ప్రొఫెషనల్ బాక్సర్స్ రంగ ప్రవేశానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించింది. సభ్య దేశాల్లో నాలుగు దేశాల ప్రతినిధుల సమావేశానికి హాజరుకాలేదు. మిగతా దేశాలన్నీ ప్రొఫెషనల్స్‌కు ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే, ఈ విషయంపై ఎఎఫ్‌పి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా లాంఛనమే అయినప్పటికీ, ఎఎఫ్‌పి అధికారికంగా ప్రకటించే వరకూ రియో ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్ బాక్సర్ల రంగ ప్రవేశం గురించి ఎఐబిఎ ఎ లాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదు. ఒకటి రెండు రోజు ల్లో ఎఎఫ్‌పి నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.