స్పాట్ లైట్

మెర్కెల్ ఓ నాజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీ ప్రధాని రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ జర్మనీ చాన్సరల్ మెర్కెల్‌పై నిప్పులు చెరుగుతున్నారు. నాటి నాజీ తరహా విధానాలనే అనుసరిస్తున్నారంటూ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య కలకలం రేపాయి. అదే క్రమంలో నెదర్లాండ్స్‌పైనా ఎర్డోగన్ కయ్యానికి కాలుదువ్వే రీతిలో వ్యవహరించడం అంతర్జాతీయంగా వివాదాన్ని రగిలిస్తోంది. టర్కీ ఆగ్రహానికి కారణం..ద్వంద్వ పౌరసత్వం విషయంలో తమతమ దేశాల్లో ‘సానుకూల’ ర్యాలీలకు జర్మనీ, నెదర్లాండ్స్ అనుమతించక పోవడమే.అయితే ఈ ర్యాలీలను భద్రతాపరమైన కారణాల వల్లే రద్దు చేశామని ఇటు జర్మనీ, అటు నెదర్లాండ్స్ చెబుతున్నా ఎర్డోగన్ మాత్రం తగ్గడం లేదు. మెర్కెల్ నాటి నాజీలను తలదనే్న రీతిలో వ్యవహరిస్తున్నారంటూ మరింతగా రెచ్చిపోతున్నారు. భావ స్వేచ్ఛను అణచివేయడంలో నెదర్లాండ్స్ కూడా జర్మనీని మించిపోతోందన్నది ఆయన తాజా ఆరోపణ. తన ఆగ్రహాన్ని ఐరోపా యూనియన్‌లో చేరడంపైనా ఎర్డోగన్ చూపిస్తున్నారు. తమకు ఇష్టమైతేనే ఐరోపా యూనియన్‌లో చేరతామని, ఈ విషయంలో ఎవరి వత్తిళ్లకూ లొంగేది లేదనీ చెబుతున్న ఎర్డోగన్ ఈ చర్చల్ని కొనసాగించేదీ లేనిదీ త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఐరోపా యూనియన్ సభ్యత్వం కోసం టర్కీ చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అయితే అప్పట్లో అది పూర్తిగా ఆర్థిక పరమైన యూనియనేనని, ఇనే్నళ్ల కాలంలో రాజకీయాలూ ప్రబలమయ్యాయన్నది ఆయన తాజా వాదన. ఏప్రిల్‌లో జరిగే రాజ్యాంగ రిఫరెండం అనంతరమే ఈ విషయంలో టర్కీ తన నిర్ణయాన్ని వెల్లడించే ఆవకాశం ఉంది. ఐరోపా యూనియన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మార్కెల్‌పైనే ఎర్డోగన్ కనె్నర్ర చేయడం, ఆమెపై తీవ్రస్థాయిలో ‘నాజీ’ అరోపణల చేయడం ఐరోపా యూనియన్‌లో సభ్యత్వ అవకాశాల్ని కాలదన్నుకోవడమే.

చిత్రం.... టర్కీ ప్రధాని ఎర్డోగన్ *జర్మనీ చాన్సలర్ మెర్కల్