స్పాట్ లైట్

యుద్ధమే జరిగితే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట వినని ఉత్తర కొరియాకు తీవ్ర నష్టమే అణ్వాయుధ ప్రయోగం జరిగితే వినాశనమే

ఇప్పటికే లక్షన్నరమంది సైనికుల్ని మోహరించిన చైనా ట్రంప్ తదుపరి అడుగే కీలకం

సాంకేతికంగా చెప్పాలంటే ఎలాంటి హెచ్చరిక లేకుండా ఉత్తర కొరియాపై అమెరికాగానీ, అమెరికాపై ఉత్తర కొరియాగానీ, అలాగే ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య గానీ పరస్పర దాడులు జరిగేందుకు ఏ రకంగానూ ఆస్కారం లేదు. ఒకవేళ ముందస్తు హెచ్చరిక లేకుండానే యుద్ధం చేయాల్సి వస్తే అందుకు ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని 51వ అధికరణలోని నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది.

ఉత్తర కొరియాను వెనకేసుకొస్తున్న చైనా ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే లక్షా యాభైవేలమంది సైనికులను ఉత్తర కొరియాకు చైనా తరలించింది. ఆ సైనికులకు ఏమాత్రం యుద్ధం వల్ల నష్టం జరిగినా తనకెందుకులే అని చైనా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండే అవకాశం ఉండదు.

ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియాపై అమెరికా దాడిచేసే అవకాశాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఓపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోపక్క ఐక్యరాజ్య సమితి ఎన్నోసార్లు హెచ్చరించినా, బుజ్జగించినా, వారించినా కూడా ఉత్తర కొరియా దారికొచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో పరిస్థితి ఏ క్షణంలోనైనా శృతిమించే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. నేటి అంతర్జాతీయ వాతావరణంలో యుద్ధమంటే ఏ దేశానికి ప్రయోజనం కలిగించని నిరర్ధక ఫలితమే. పైగా ఒకప్పటి యుద్ధ వాతావరణానికి నేటి పరిస్థితులకు ఏ కోశానా పొంతన లేదు. గతంలో మాదిరిగా పదాతి దళాలను మోహరించే పరిస్థితే లేదు. ధ్వంసమైనా, విధ్వంసమైనా, వినాశనమైనా రెప్పపాటు కాలంలోనే జరిగిపోతుంది. అందుకు పాల్పడేది ఎవరన్న దానిపై నిమిత్తం లేదు. ఎవరు ఎవరిని కవ్వించారన్నదానితోనూ నిమిత్తం లేదు. ఉత్తర కొరియా తన అణు పరీక్షలను, క్షిపణి పరీక్షలను ఆపకపోతే తీవ్ర స్థాయిలో విధ్వంసానే్న ఎదుర్కొంటుందని అమెరికా హెచ్చరించడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు అవాక్కయ్యాయి. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై అల్‌ఖైదా దాడి చేసిన అనంతరం అటు అఫ్గానిస్తాన్‌పైనా, ఇటు ఇరాక్‌పైనా యుద్ధ నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు ఏళ్లకు ఏళ్లే పట్టింది. అందుకు కారణం యుద్ధానికి దిగడమంటే ఒక అంతూ పొంతూ లేని మార్గంలో అడుగుపెట్టడమే. లేనిపోని నష్టాన్ని, కష్టాన్ని కొనితెచ్చుకోవడమే. కానీ అప్పటి పరిస్థితుల్లో అఫ్గాన్, ఇరాక్‌లు మామూలు దేశాలు. వాటికి అణుపాటవం ఏ కోశానా లేదు. ఇరాక్ వద్ద మానవాళి విధ్వంసానికి దారితీసే రసాయనిక ఆయుధాలు ఉన్నాయన్న నెపంతో ఏకకాలంలో రెండు దేశాలపైనా నాటో దళాల సాయంతో అమెరికా యుద్ధం చేసింది. దాని ఫలితాలు, పర్యవసానాలు అందరికీ తెలిసినవే. అల్‌ఖైదా అంతమైనా, దాని అధినేత లాడెన్ హతమైనా ఇప్పటికీ అఫ్గాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్న దాఖలాలు లేవు. అలాగే ఇరాక్‌లో సద్దాం పాలనకు తెరదించిన అమెరికా మధ్యలోనే అక్కడినుంచి నిష్క్రమించింది. అఫ్గాన్‌లోనూ అదే పని చేసింది. కారణం ఏళ్లకు ఏళ్లు సాగిన యుద్ధ భారాన్ని భరించలేకపోవడమే. మొదట్లో సహకరించినట్లుగా చివరి వరకు నాటో దళాలు వెన్నుదన్నుగా నిలవకపోవడమే. ఇప్పుడు ఉత్తర కొరియా విషయంలోనూ అదే పరిస్థితిని అమెరికా ఎదుర్కొంటోంది. నిరంతరం కవ్వించడమే తప్ప రాజీ మార్గానికి ససేమిరా అంటున్న ఈ కొరకరాని కొరివితో తల గోక్కుంటే అంతర్జాతీయ శాంతికే విఘాతం కలిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తనకు అణుపాటవం ఉందన్న విషయాన్ని ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న బలమైన సంకేతాలను అందించింది. ఒకవేళ ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఉత్తర కొరియాపై అమెరికా దాడికి దిగితే, యుద్ధ్భేరి మోగిస్తే ఫలితం ఏమిటి? అందుకు మిగతా మిత్రపక్షాలు సహకరిస్తాయా? అసలు పరిస్థితి అంతవరకు రాకుండా వారిస్తాయా అన్నది సమాధానం లేని ప్రశ్నగానే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా యుద్ధం అనివార్యమైతే దాని పరిస్థితులు పరిణామాల భారాన్ని అన్ని దేశాలూ మోయాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటినుంచి అంతర్జాతీయ సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలంటే అమెరికా ఆధిపత్య శక్తిని రుజువు చేసుకోవాలంటే తన కండ బలాన్ని, అంగబలాన్ని శాస్త్ర, సాంకేతిక పాటవాన్ని ప్రదర్శించాలన్నదేనన్న భావన ట్రంప్ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇటీవల సిరియాపై రసాయనిక దాడులు జరిగాయి. అదేవిధంగా రష్యా అండదండలు కలిగిన అసాద్‌పైనా దాడులకు అమెరికా సిద్ధమైంది. అలాంటప్పుడు కిమ్ జాన్ ఉన్ సారథ్యంలోని ఉత్తర కొరియాను ఇంతగా కవ్విస్తున్నా క్షమించే అవకాశం ఉండదన్నది వాస్తవం. గత నాలుగైదు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టేవిగానే ఉన్నాయి తప్ప ఉపశమన వాతావరణానికి ఆస్కారం ఇవ్వడం లేదు. మాటల్లో కాకుండా చేతల్లోనే రంగంలోకి దిగితే తప్ప ఉత్తర కొరియా దారికొచ్చే అవకాశం లేదన్న విషయం ఎప్పుడో తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమెరికా కొరియా ద్వీపకల్పానికి తన నౌకాదళాలను తరలించింది. ఉత్తర కొరియా ఏమాత్రం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా పరిస్థితులు, పర్యవసానాలు అత్యంత విఘాతకరంగానే ఉంటాయని నిర్ద్వంద్వంగానే తెలిపింది. ఈ వాతావరణంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య యుద్ధమే జరిగితే చోటుచేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయో గమనిస్తే వాటి తీవ్రత అర్థమవుతుంది.
సాంకేతికంగా చెప్పాలంటే ఎలాంటి హెచ్చరిక లేకుండా ఉత్తర కొరియాపై అమెరికాగానీ, అమెరికాపై ఉత్తర కొరియాగానీ, అలాగే ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య గానీ పరస్పర దాడులు జరిగేందుకు ఏ రకంగానూ ఆస్కారం లేదు. ఒకవేళ ముందస్తు హెచ్చరిక లేకుండానే యుద్ధం చేయాల్సి వస్తే అందుకు ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని 51వ అధికరణలోని నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అంటే ఆత్మరక్షణ కోసమే తాము ఈ దాడి చేశామన్న విషయాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ దాడి లక్ష్యాలను రుజువు చేసుకోవడమన్నది ఉత్తర కొరియాకంటే అమెరికాకే ఎక్కువ కష్టం. అయినా కూడా అమెరికా యుద్ధానికి దిగితే అది అణు యుద్ధమే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కిమ్ జాంగ్ ఉన్ సైన్యం ఏకాకిగా మారిపోతుంది. ముందస్తుగా ఒక వ్యూహాత్మక రీతిలో ఉత్తర కొరియా క్షిపణి స్థావరాలను, శతఘ్ని సమూహాలను అమెరికా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలన్నీ ఆధునిక టెక్నాలజీతో క్షణాల్లోనే జరిగిపోయే అవకాశం ఉంటుంది. అమెరికాకు అపారమైన వైమానిక శక్తి ఉంది కాబట్టి ఉత్తర కొరియాలో కీలకమైన సైనిక స్థావరాలను, అణు కేంద్రాలను క్షణాల్లో ధ్వంసం చేయగలుగుతుంది. వైమానిక దాడులవల్ల అన్ని రకాలుగా ఉత్తర కొరియాకు సరఫరాలు ఆగిపోతాయి. యుద్ధ వాతావరణం ఇలాంటి పరిస్థితులకే పరిమితమైతే నష్టం అన్నది ఇరు దేశాల మధ్య ఉంటుంది. అణ్వాయుధ ప్రయోగం జరిగితే మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగానే ఉంటాయి. అలాగే ఉత్తర కొరియాకు నిజంగా అణుపాటవం ఉందా? క్షిపణుల సాయంతో అణ్వాయుధాలను ప్రయోగించగలుగుతుందా? అన్నది అప్పటికప్పుడే తేలిపోతుంది. అయితే క్షిపణుల్లో ఇమిడి పోయే అణ్వాయుధాలను తాము సముపార్జించుకున్నామంటూ ఉత్తర కొరియా అధినేత చేస్తున్న ప్రకటనల్లో నిజమెంతో తేలాల్సి ఉంటుంది. ఒకవేళ ఉత్తర కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినా వాటిని నిరోధించగలిగే, అంటే మార్గమధ్యంలోనే తుత్తునియలు చేయగలిగే పాటవం అమెరికాకు ఉంది. అంటే ఉత్తర కొరియా ఎంతగా గింజుకున్నా అది వేసే క్షిపణులు, ముఖ్యంగా ఖండాంతర క్షిపణులు అమెరికా భూభాగాన్ని తాకే అవకాశమే లేదు. ఒకవేళ అందుకు ఉత్తర కొరియా ఒడిగడితే అమెరికా భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించి వాటిని పేలిస్తే నష్టం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఎంత చెప్పినా మాట వినని ఉత్తర కొరియాను అదుపులోకి తేవడమంటే అది అణుయుద్ధం వల్లే సాధ్యమవుతుందని ఇప్పటికే ట్రంప్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఏక్షణంలోనైనా అణు రెడ్ బటన్‌ను నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారన్న కథనాలు కలవరపెడుతున్నాయి. నిజంగా అమెరికా అణు యుద్ధానికి దిగుతుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేకపోయినా పరిస్థితి విషయమిస్తే మాత్రం ఆ పరిణామం అనివార్యమవుతుంది. ఐసిస్‌పై అవసరమైతే అణ్వాయుధ దాడి చేస్తామని చెప్పిన ట్రంప్ ఉత్తర కొరియాపై అంత తీవ్ర నిర్ణయానికి ఒడిగడతారా అన్నది కూడా నమ్మశక్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో మొదటినుంచీ ఉత్తర కొరియాను వెనకేసుకొస్తున్న చైనా ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే లక్షా యాభైవేలమంది సైనికులను ఉత్తర కొరియాకు చైనా తరలించింది. ఆ సైనికులకు ఏమాత్రం యుద్ధం వల్ల నష్టం జరిగినా తనకెందుకులే అని చైనా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండే అవకాశం ఉండదు. దౌత్య ప్రయత్నాలన్నీ విఫలమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గురుతర రీతిలో రంగంలోకి దిగి పరిస్థితి యుద్ధం వరకు వెళ్లకుండా శాంతియుత వాతావరణాన్ని పాదుకొల్పడం ఎంతైనా అవసరం.

బి.రాజేశ్వర ప్రసాద్