స్పాట్ లైట్

కథ మొదటికి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న దూరం

బరాక్ ఒబామా హయాంలో సరికొత్త మైత్రీ బంధానికి శ్రీకారం చుట్టిన ఇరాన్-అమెరికాల మధ్య కొత్త చిచ్చు రాజుకుంటోంది. ఇతర దేశాలతో తాము కుదుర్చుకున్న అణు ఒప్పందం విషయంలో అమెరికా ఏ మాత్రం తప్పటడుగు వేసినా తీవ్రస్థాయిలోనే ప్రతిస్పందించాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా ఖమేనీ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అణు ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధంగా ఇరాన్ వ్యవహరిస్తోందంటూ గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇతర దేశాలతో కుదుర్చుకున్న అణు ఒప్పందంపై ట్రంప్ దృష్టి పెట్టారో అప్పటి నుంచి రగడ మొదలైంది. ‘ఇంత ఘోరమైన అంతర్జాతీయ ఒప్పందాన్ని నేనెప్పుడూ చూడలేదు’అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను 2015లో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా కొంత మేర సడలించిన అమెరికా ఈ ఒడంబడికను కొనసాగించాలా వద్దా అన్న విషయంలో డోలాయమానంలో పడింది. తాము ఒప్పందంలోని అన్ని అంశాలకు, నిబంధనలకు కట్టుబడే వ్యవహరిస్తున్నా అమెరికా ధోరణి మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త సమస్యలు సృష్టించే విధంగా ఉందంటూ ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ మొత్తం వ్యవహారంలో అనూహ్య మలుపు. తమ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఇరాన్ ప్రజలు రాజీ పడే ప్రసక్తే ఉండదని పేర్కొన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. తాము ఎంతగా సహకరిస్తున్నా అమెరికా మొండిగా వ్యవహరించి కొత్త ఆంక్షలకు దారులు తీసే పక్షంలో అణు ఒప్పందం నుంచే తప్పుకోవడానికి తాము వెనుకాడేది లేదని ఖమేనీ చేసిన ప్రకటనతో పరిస్థితి ఏ క్షణంలోనైనా మొదటికొచ్చే అవకాశం కనిపిస్తోంది.