స్పాట్ లైట్

ముందుకు ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రధాని థెరీసా మే పరిస్థితి ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి చందంగా మారుతోంది. ఆమె ఎంతగానో నమ్మకం పెట్టుకున్న ఓలీ రాబిన్స్ అనే ఓ సీనియర్ అధికారి ఆకస్మిక నిష్క్రమణతో ఆమెకు ఎటూ పాలుపోని పరిస్థితి తలెత్తింది. కారణం..బ్రెగ్జిట్‌పై ధెరీసాను ఇప్పటి వరకూ ముందుకు నడిపించింది, మార్గనిర్దేశన చేసింది ఆయనే కావడం. ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకూ చూస్తూ వచ్చిన ఉన్నతాధికారులకు కూడా ఈ పరిణామం మింగుడు పడనిదిగానే పరిణమించింది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న బ్రిటన్ ఇందుకు సంబంధించి అన్ని ప్రయోజనాలను పొందాలంటే బలమైన రీతిలో స్థిరంగా తన వాదనలను వినిపించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లోనే తదుపరి చర్చలు జరుగనున్న తరుణంలో కీలక సంధాన కర్త నిష్క్రమణ అన్నది బ్రిటన్‌ను ఏ విధంగా ముందుకెళ్లాలన్న గందరగోళంలో పడేసింది. ప్రస్తుతం డేవిడ్ డావిస్‌కు ఈ బాధ్యతలు అప్పగించినప్పటికీ బ్రిటన్‌కు ఏ విధంగానూ నష్టం కలిగించని రీతిలో ఈ చర్చలను ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళతారన్నది ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది.