స్పాట్ లైట్

అటు కవ్వింపు.. ఇటు తెగింపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర, దక్షిణ కొరియా మధ్య చినికిచినికి గాలివానగా మారి ఇప్పుడు ఏకంగా అమెరికాతోనే ముఖాముఖి సమరానికి దారులుతీసే పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అణుయుద్ధమే జరిగితే అనర్థాలు అనంతం అన్నది వాస్తవం. వర్తమాన ప్రపంచంలో ఏ దేశం కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఎప్పుడైతే అమెరికా, రష్యాల మధ్య ప్రత్యన్న యుద్ధం సమసి, ఈ రెండు పెద్ద దేశాలూ అడపాతడపా మైత్రీ బంధానికి తెరతీస్తూ వస్తున్నాయో.. అప్పటి నుంచి కూడా వీటికి అనుకూల, ప్రతికూల దేశాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కారణం -కేవలం ఒక దేశానే్న నమ్ముకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించడం కష్టమవుతుందన్న భావనే. ఇలాంటి పరిస్థితుల్లో కయ్యంకంటే వియ్యమే అన్నివిధాల శ్రేయస్కరమన్న సమభావన సర్వత్రా పరిఢవిల్లుతున్న తరుణంలో ఉత్తర కొరియాతో అమెరికాకు తలెత్తిన వివాదం ఇక యుద్ధమే శరణ్యమా? అన్న అనివార్య వాతావరణాన్ని రగిలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం అన్నది ఎవ్వరికీ లాభం కాదు. ఇది బెదిరింపులతో, కవ్వింపులతో ఆగిపోతే తదుపరి ఇబ్బందీ ఎవ్వరికీ ఉండదు. కానీ ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్యుద్ధం వాస్తవ రూపాన్ని దాల్చే అవకాశాలు బలపడుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఉ.కొరియాను వెనకేసుకుంటూ వచ్చిన చైనా, రష్యాలు కూడా దాని బరితెగింపు ధోరణికి తీవ్ర ఆగ్రహానే్న వ్యక్తం చేస్తున్నాయి. ఏవిధంగా చూసినా అమెరికా దాడిని తట్టుకునే పరిస్థితి ఉ.కొరియాకు లేదన్నది వాస్తవం. అయినప్పటికీ యుద్ధం జరిగితే అది ఈ రెండు దేశాలకే పరిమితం కాదు. అటు చైనా ప్రయోజనాలు, ఇటు రష్యా ప్రయోజనాలు కూడా అంతర్జాతీయ దెబ్బతినే పరిస్థితి తలెత్తుతుంది. చర్చలతో పరిష్కారం కాని సమస్యంటూ ఏదీ ఉండదు. అయితే, అందుకు కావాల్సింది పరస్పర అవగాహన, సర్దుబాటు ధోరణి. కానీ, ఈ సానుకూల వాతావరణం లేదా ధోరణి అమెరికా, కొరియాల మధ్యగానీ కిమ్‌జోంగ్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్యగానీ ఏ కోశానా కనిపించటం లేదు. అమెరికాకు తన ప్రయోజనాలను కాపాడుకోవడం ఎంతముఖ్యమో, తననే నమ్ముకునే దేశాలను అన్ని విధాలుగా ఆదుకోవడమూ అంతే ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే ఉత్తర కొరియావల్ల దక్షిణ కొరియకు నష్టం కలుగుతుందన్న ఆందోళనతోనే నేరుగానే అమెరికా కదనరంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇంతగా శ్రుతిమించడానికి ఇద్దరు నేతల మధ్య రాజీకి ఆస్కారం లేకపోవడానికి కారణమైన పరిస్థితులు వేరైనప్పటికీ, వాస్తవికంగా పెను వైరమే పెనవేసుకుంటోంది. ఏ సమస్యనైనా ఆదిలోనే పరిష్కరించాలి. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్టుగా ఉ.కొరియా బరితెగింపు ముదిరిపోయిన తరువాత సామ దాన భేదాలన్నీ సమసిపోయి ఇక దండోపాయమే శరణ్యమన్న పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా తన యుద్ధ విమానాలను కొరియా ద్వీపకల్ప తీరంలో మోహరించటం, అదేవిధంగా దక్షిణ కొరియాతో కలిసి నౌకా విన్యాసాలు చేయడం కూడా ఉ.కొరియాను కవ్వించడంగానే భావించాలి. తన చేతిలో ఆయుధం ఉంటే, అదీ అణ్వాయుధమైతే అమెరికా కాదు కదా ఏ దేశమూ తమను ఏమీ చేయలేదన్న ధీమాతోనే ఉ.కొరియా రెచ్చిపోతోంది. కేవలం క్షిపణి పరీక్షలతో సిరపెట్టకుండా ఇటీవల హైడ్రోజన్ బాంబునూ పేల్చి మొత్తం ప్రపంచ దేశాలనే గడగడలాడించింది. నిజంగా ఉ.కొరియాకు అమెరికావంటి దేశంపై దాడి చేయగలిగే స్థాయి, సత్తా లేదా అణుపాటవం ఉందా? లేదా? అన్నది పక్కనపెడితే, దాని బెదిరింపులు, కవ్వింపుల కారణంగా పరిస్థితి ఏ క్షణంలోనైనా విషమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉ.కొరియాపై ఐక్యరాజ్య సమితి ఎన్నో ఆంక్షలు విధించింది. అదేవిధంగా వెన్నుదన్నుగా నిలిచిన చైనా కూడా నచ్చజెప్పేందుకు, బుజ్జగించేందుకు తనవంతు గురుతర ప్రయత్నమే చేసింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఎవరెంతగా బుజ్జగించినా, నచ్చజెప్పినా కూడా సమరానికి సై అన్నట్టుగానే ఉ.కొరియా సంకేతాలు అందిస్తోందే తప్ప దారికి రావడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ముందున్న తదుపరి మార్గమేమిటి? దాడి ఒక్కటేనా? ఆ కాస్తా జరిగే వరకూ ఉ.కొరియా దారికి రాదా? ఇవన్నీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న అంశాలు. అంతిమంగానే యుద్ధ భేరీ మోగించాల్సిన పరిస్థితి ఇది. ఆ తీవ్ర చర్య తీసుకోవడానికి ముందు ఏ అంశాన్నీ వదలకుండా, ఏ మార్గాన్నీ విడనాడకుండా సమతా, సామరస్యం, సయోధ్య మార్గాల్లో ముందుకు వెళ్లి తీరాల్సిందే. యుద్ధం అన్నది నేటి పరిస్థితుల్లో ఒక దేశ సమస్య కాదు. దానితో ముడిపడివున్న అనేక దేశాల భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని కనబర్చే అంశం. కేవలం ఇద్దరు నేతల దుందుడుకు తనం వల్లో, ఒకర్నొకరు రెచ్చగొట్టుకుంటున్న కారణంగానో యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితి ఉండకూడదు. ఇందుకు ఐరాస నడుం బిగించాలి. అమెరికాకూ నచ్చజెప్పాలి. ప్రపంచ దేశాలనకూ కూడగట్టాలి. అప్పుడే ఉ.కొరియా దూకుడుకు కళ్లెం పడుతుంది. కిమ్ జోంగ్ బరితెగింపు ధోరణికి ముకుతాడు వేసినట్టు అవుతుంది.