స్పాట్ లైట్

సీను మారిన జర్మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెర్కెల్ ముంగిట సవాళ్ల పరంపర సంకీర్ణంతోనే మనుగడకు అవకాశం అధినేత్రి తదుపరి బాధ్యత ఏమిటి?
జర్మనీ చాన్సలర్‌గా అంజీలా మార్కెల్ నాలుగోసారి సాధించిన విజయం ఐరోపాలో సుస్థిర రాజకీయ, ఆర్థిక శాంతి స్థాపనకు బలమైన సంకేతంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఐరోపా యూనియన్ రాజకీయ స్థిరత్వాన్ని సంతరించుకుందంటే అందుకు కారణం మెర్కెల్ సానుకూల వైఖరేనని చెప్పక తప్పదు. అయితే ఇన్నాళ్లూ ఆమె నాయకత్వానికి ఎదురైన పరిస్థితులు ఒక ఎత్తయితే తాజాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పని అనివార్య రాజకీయ వాతావరణం ఆమెకు ఎదురవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడం అన్నది ఆమెకు అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు. ఇందుకు వారాలే కాదు నెలలకు నెలలే పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ మెర్కెల్ సారథ్యంలోని మహా సంకీర్ణంలో జూనియర్ భాగస్వామ్య పక్షంగా ఉన్న సోషలిస్టు డెమొక్రాట్లు ఇప్పుడు ప్రతిపక్షంగా మారడం విడ్డూర పరిస్థితి. గత నాలుగేళ్లుగా కన్సర్వేటివ్‌ల సారథ్యంలోని సంకీర్ణంలోనే ఉన్న ఈ పార్టీ విపక్షంగా మారడం మెర్కెల్‌కు దేశీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్టు లెక్కే! ముఖ్యంగా ఫార్ రైట్ పార్టీలు ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంత తేలిగ్గా జరిగేదిగా కనిపించడం లేదు. వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘ఎయిడ్’పార్టీ 13.1శాతం ఓట్లతో తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ పరిణామాలన్నీ కూడా రానున్న కాలంలో జర్మనీ చాన్సలర్‌గా మెర్కెల్ ఎదుర్కోబోతున్న సంక్లిష్ట పరిస్థితులకు సంకేతంగానే భావిస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు దేశాధిపత్యాన్ని చేపట్టిన మెర్కెల్‌కు తాజా ఎన్నికల ఫలితాలు అనూహ్యమైన సవాళ్లతో కూడిన వాతావరణానే్న కల్పించాయి. ఈ ప్రతికూల పరిస్థితులను ఆమె ఏవిధంగా ఎదుర్కోగలుగుతారు. పార్లమెంటులో మారిన పరిస్థితులను ఎలా అధిగమించగలుగుతారన్నది ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఈ కూటమి పరిస్థితి ఏమవుతుందన్నది ఎనలేని ఆందోళననే రేకెత్తించింది. ఐరోపా యూనియన్ దేశాధినేతలందరూ కూడా మెర్కెల్ రాజకీయ పలుకుబడిపైన నాయకత్వ పఠిమపైనే ఆశలు పెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో మెర్కెల్ ఎన్నిక కాకుండా ఉన్నట్లయితే ఐరోపా యూనియన్ పరిస్థితి మరోలా మారిపోయి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని పరిస్థితులు మారినప్పటికీ పార్లమెంటులో సంఖ్యాబలంలో కొంత తేడా కనిపించినప్పటికీ మెర్కెల్ నాయకత్వానికే జర్మనీ ప్రజలు ఓటు వేయడంతో ఐరోపా యూనియన్ పటిష్ఠత విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదన్న వాస్తవికత సర్వత్రా ద్యోతకమవుతోంది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా, కన్సర్వేటివ్ కూటమిగా మెర్కెల్ పార్టీ ఎన్నికైనప్పటికీ ఓట్ల పరంగా 33.2 శాతం ఓట్లను మాత్రమే సంతరించుకోగలిగింది. 1949 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయిలో కన్సర్వేటివ్ కూటమికి ఓట్లు రావడం అన్నది ఇదే మొదటిసారి. అలాగే సోషల్ డెమోక్రాట్ ప్రత్యర్థులు సైతం 1940 నుంచి ఎన్నడూ లేని విధంగా 20.8 శాతం ఓట్లను మాత్రమే సంతరించుకోగలిగారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకూ జర్మనీ రాజకీయాలను శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీలనూ సగానికి పైగా ఓటర్లు తిరస్కరించడం అన్నది అనూహ్యమైన పరిణామమే. ఏ రకంగా చూసినా కూడా గతంలో జర్మనీ పార్లమెంటుకు తాజాగా ఆవిష్కరించబోతున్న కొత్త పార్లమెంటుకు మధ్య హస్తి మశకాంతకం ఉంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే అన్ని వర్గాలను మెర్కెల్ కలుపుకుపోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఈ విషయంలో మెర్కెల్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది రాబోయే కాలంలో జర్మనీ రాజకీయాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలను బట్టే ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ కూడా ఈ రకమైన పరిస్థితి జర్మనీ జాతీయ రాజకీయాల్లో ఎదురుకాలేదు. మిగతా పార్టీలు కొత్త సంకీర్ణ ఏర్పాటుకు మెర్కెట్‌కు ఏ విధంగా సహకరిస్తాయన్నది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి.

బి.రాజేశ్వర ప్రసాద్