స్పాట్ లైట్

రిస్కే.. అయినా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెజారిటీ తగ్గితే పరిస్థితి ఏమిటి?

ఉత్తర కొరియా సెగలు రేపుతున్న నేపథ్యంలో అంతర్గతంగా తలెత్తిన రాజకీయ పరిణామాలను ఎదుర్కొనేందుకు జపాన్ ప్రధాని షింజో అబే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడం ఎంతమేరకు ఆయనకు మరింత బలాన్ని ఇస్తుందనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. మొదట్లోకంటే కూడా ఇప్పుడు షింజో అబే ప్రాచుర్యం, ప్రాబల్యం గణనీయంగా తగ్గాయి. అదే క్రమంలో ప్రతిపక్షాల ప్రతిష్ఠ కూడా మరింత ఇనుమడించింది. ఈ పరిస్థితుల్లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం అన్నది సరైన నిర్ణయమా కాదా అన్నది ఈ నెల 22న జరిగే ఓటింగ్‌లో ప్రజలే తేల్చబోతున్నారు. గత గురువారం అనూహ్య రీతిలో దిగువ సభను రద్దు చేయడం ద్వారా ప్రధాని షింజో అబే తనకు ప్రజల నుంచి మరింత అండదండలు లభించగలవన్న ధీమానే వ్యక్తం చేశారు. షింజో అబే సారథ్యంలోని అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించే అవకాశం లేకపోయినా, ప్రస్తుతం దిగువ సభలో ఉన్న మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆవిర్భవించిన పార్టీ ఆఫ్ హోప్ ఏ మేరకు అధికార పార్టీ ప్రజా బలానికి గండికొడుతుందన్న దానిపైన ఉత్కంఠ చెలరేగుతోంది. ప్రస్తుతం ఉన్న దానికంటే ఏమాత్రం మెజారిటీ తగ్గినా తమ పాలనను మరో మూడేళ్లపాటు పొడిగించుకునే అవకాశం షింజో అబేకు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని థెరిసా మె బ్రెగ్జిట్ ప్రతికూలత నేపథ్యంలో ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి ఉన్న మెజారిటీనీ కోల్పోయారు. ఇప్పుడామెకు మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇటీవల జర్మనీలో కూడా తిరుగులేని ఆధిపత్యం కలిగిన అంజీలా మెర్కెల్‌కు మెజారిటీ తగ్గిన పరిస్థితి. ఇతర పార్టీల మద్దతు ఉంటే తప్ప బలమైన సంకీర్ణాన్ని ఆమె ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. థెరిసా మె తరహాలో పార్లమెంటులో బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో జపాన్ ప్రధాని షింజో అబె తీసుకున్న నిర్ణయం ఆయనకు అనుకూలించకపోతే రాజకీయంగా అనేక సవాళ్లకు ఆస్కారం ఏర్పడుతుంది. ఉత్తర కొరియా నుంచి తలెత్తుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని షింజో అబె ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ బహిర్గతంగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఇది ఎంతమేరకు దోహదం చేస్తుందన్నది ప్రజలు కట్టబెట్టే మెజారిటీపైనే ఆధారపడి ఉంటుంది. లిబరల్ డెమొక్రాట్ పార్టీలో తన పట్టును మరింత పెంచుకోవడం ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లోనూ తానే విజేతగా నిలిచేందుకు షింజో అబె ఇప్పటినుంచే బలమైన అడుగులు వేశారని భావించాలి. అయితే ఇది అనేక రిస్కులు సవాళ్లతో కూడుకున్నదే అన్నది విశే్లషకుల అంచనా.
ముఖ్యంగా అతిపెద్ద ప్రతిపక్షంగా ఉన్న ది డెమొక్రాటిక్ పార్టీలో సంక్షోభ వాతావరణం నెలకొన్నది కాబట్టి అధి ఒకరకంగా షింజో అబెకు అనుకూలమైన పరిస్థితులను పాదుగొల్పే వీలుంటుంది. అలాగే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని షింజో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం పార్టీ ఆఫ్ హోప్‌ను కూడా గందరగోళంలో పడేసింది. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగడానికి కేవలం మూడు వారాల వ్యవధి కూడా లేదు. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకోవడం, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం ఈ పార్టీకి అంత తేలికైన వ్యవహారం కాదు. మొత్తంమీద షింజో అబె రానున్న ఎన్నికల్లో మరింత పట్టు సాధిస్తే రక్షణ, భద్రతాపరంగానూ జపాన్ వ్యూహాత్మకంగా బలమైన అడుగు వేసే అవకాశం ఉంటుంది.