స్పాట్ లైట్

శరణు.. శరణు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అతి కొద్ది దేశాలు మినహా నిత్యం కల్లోలంతో అశాంతితో రగులుతున్న దేశాల సంఖ్యే ఎక్కువ. ముఖ్యంగా మైన్మార్, దక్షిణ సూడాన్, సిరియా తదితర దేశాల విషయానికొస్తే పౌరులే ధైర్యంగా జీవించలేని పరిస్థితి. నిత్యం సాయుధ పోరాటాలు, ఘర్షణలు, సంఘర్షణలు ఆ ప్రజల దైనందిన జీవన వేదనగా మారాయి. ఉన్నచోట ఉండలేక, మరోచోటకు వెళ్లి ధైర్యంగా తలదాచుకోలేక రెంటికీ చెడ్డ రేవడి చందంగా లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగానే ఏళ్లకు ఏళ్లు గడుపుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూల పరిస్థితుల కారణంగా ఏ దేశం తనంతట తానుగా నిలబడే పరిస్థితి లేదు. ఆర్థికంగానో, రాజకీయంగానో, వ్యాపార వాణిజ్యపరంగానో ఇతర దేశాలతో సయోధ్య కూడిన సన్నిహిత సంబంధాలు అన్ని దేశాలకూ అనివార్యంగానే మారాయి. కొన్ని దేశాల పరిస్థితి అయితే స్వంత ప్రజలనే పోషించుకోలేని దయనీయ స్థితి. తమ ప్రతి అవసరానికి ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లక్షల సంఖ్యలో శరణార్థుల తాడికి పెరిగితే ఆయా దేశాల పరిస్థితి మరింత దారుణంగా, దయనీయంగానే మారుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం శరణార్థులను వెనక్కి పంపేస్తున్నాయంటే వారి పోషణ భారం ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎంత మానవీయ దృక్పథం ఉన్నా మానవతా విలువలను పరిరక్షించాలన్న విశాల సంకల్పం ఉన్నా తలకు మించిన భారాన్ని, బాధ్యతను ఏ దేశమూ తలకెత్తుకోలేదు. ఈ పరిస్థితుల్లో గత రెండేళ్లలోనే అనేక దేశాల పరిస్థితి ఓడలు బళ్లయిన చందంగా మారింది. అందుకే అంతటా శరణార్థుల తాకిడి పెరిగిపోయింది. వీరిని కాదనలేక పొమ్మనలేక దారులను మూసేయలేక సతమతమవుతున్న దేశాల సంఖ్యా పెరుగుతోంది. అసలు మాతృ దేశం నుంచి మరో దేశానికి పారిపోవాల్సిన దుస్థితి పౌరులకు ఎందుకు కలుగుతుంది? ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, ప్రజల ఆలనా పాలనా చూస్తే ఈ రకమైన విషతుల్య పరిణామాలకు ఆస్కారమే ఉండదు. మైన్మార్, దక్షిణ సూడాన్, సిరియాతోపాటు అనేక దేశాల్లో స్వంత ప్రజలకే నిలువ నీడలేని దుస్థితి రావడానికి కారణం ఎడతెగని వేధింపులు, అంతూ పొంతూలేని హింసాకాండ. ప్రభుత్వ బలగాలకు, రెబెల్స్‌కు మధ్య అవిశ్రాంత పోరాటం. ఇవన్నీ కూడా ఎక్కడా ఎవరూ మనశ్శాంతిగా జీవించేందుకు ఆస్కారం ఇచ్చే పరిస్థితులు కావు. ఉదాహరణకు మైన్మార్ విషయానే్న తీసుకున్నా అక్కడ రోహింగ్యా ముస్లింలది మైనారిటీ. అటు బంగ్లాదేశ్ నుంచో, మరోచోటు నుంచో దశాబ్దాల క్రితమే వీరంతగా మైన్మార్‌లోని ఒక ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే మొదటినుంచీ మైన్మార్ సైనిక పాలనలోనే ఉండి కాబట్టి ఈ రోహింగ్యాలకు పౌరసత్వాన్ని కల్పించే అవకాశమే లేకుండా పోయింది. ఉండడానికి గూడున్నా అది తమదో కాదో తెలియని అనిశ్చిత పరిస్థితులలో దశాబ్దాలుగా ఈ మైనారిటీ ప్రజలు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. ఇప్పుడు స్వంత ప్రాంతం నుంచే వీరు మరోచోటుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడలేని నిర్వేదం, నైరాశ్యం, తెగింపు చోటుచేసుకున్నాయి. తిరుగుబాట్లు మొదలుకావడంతో మైన్మార్ బలగాలు దాడులకు ఒడిగట్టడంతో వీరు పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాదిలోనే శారణార్థులుగా కల్లోల దేశాల నుంచి పరారైన వారి సంఖ్య దాదాపు 20లక్షలకు పైగానే ఉందని ఐక్యరాజ్య సమితే లెక్కలు గట్టింది. 2016 చివరి నాటికి దాదాపు 65.6 మిలియన్ మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా తమ ఇళ్లను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారు కావాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ ఐ.రా.స ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. వీరిలో 22.2 మిలియన్ మంది శరణార్థులుగా నమోదైనప్పటికీ మిగతా వారి పరిస్థితి అథోగతే. ఈ శరణార్థుల్లో పురుషులు, మహిళలే గాకుండా ముక్కుపచ్చలారని పసిబిడ్డలు కూడా ఉండడం, ఒక ప్రాంతం నుంచి మరో దేశానికి పరారవుతున్న సమయంలో వందల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోవడం అన్నది మానవత్వం పైనే తీరని మచ్చ. ప్రపంచ దేశాలన్నీ ఈ శరణార్థుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకునే విషయంలో సమష్టి ప్రయత్నంగా ఓ విధాన పరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. అయితే ఏ ఒక్క దేశమో, రెండు దేశాలో లక్షల సంఖ్యలో ఉన్న శరణార్థులను ఆదుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం చేతులు దాటిన ఈ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూనే వీరి మాతృదేశాల్లో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఐక్యరాజ్య సమితి సారథ్యంలో ప్రపంచ దేశాలు చేపట్టాలి. తమ స్వార్థం కోసమో, మిత్ర దేశాల సౌఖ్యం కోసమో లేదా తమ ఆధిపత్య లక్ష్యాలను సాధించుకోవాలన్న తాపత్రయం కోసమో చిన్న చిన్న దేశాల్లో కల్లోలాన్ని సృష్టిస్తే అవి అనంతర కాలంలో చినికి చినికి గాలివానగా, ఉప్పెనగా, పెను శరణార్థ తుపానుగా మారతాయనడానికి ప్రస్తుత పరిణామాలకు మించిన దృష్టాంతాలే లేవు. సమస్య మూలాన్ని ఛేదించగలిగితే సానుకూల, గుణాత్మక, సయోధ్యతో కూడిన వాతావరణాన్ని కల్లోల దేశాల్లో కల్పించగలిగితే శరణార్థ సమస్యను మొగ్గలోనే తుంచివేయడం సాధ్యమవుతుంది. ఇందుకు ప్రధానంగా కావాల్సింది రాజకీయ చిత్తశుద్ధితో కూడిన అంకితభావం. శరణార్థులను ఆదుకునేందుకు అత్యవసర ప్రాతిపదికన ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది.
చాలా సందర్భాల్లో ఈ శరణార్థ శిబిరాల్లోనే వీరికి రక్షణ లేని పరిస్థితులు కోకొల్లలు. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ 4.4 బిలియన్ డాలర్ల నిధులను అందుబాటులోకి తెచ్చినా అది ఏమాత్రం సరిపోని పరిస్థితి. రాజకీయాలను పక్కనబెట్టి శరణుజొచ్చినవారిని ఆదుకుని ఉదాత్తతను అన్ని కోణాల్లో ప్రస్ఫుటించాలి.