స్పాట్ లైట్

కత్తిమీద సామే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడుసార్లు జర్మనీ చాన్సలర్‌గా ఎన్నికై తిరుగులేని అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించిన అంజీలా మెర్కెల్‌కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. పార్లమెంటులో మెజారిటీ తగ్గడంతో ఆమె ఏమి చేయాలన్నా కూడా మిత్రపక్షాలను సంప్రదిస్తే ముందుకు వెళ్లలేని పరిస్థితి. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి త్వరలో చర్చలు జరగనున్న తరుణంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి విఘాతం కలగని రీతిలో మెరికల్లాంటి ఆలోచనలతో మెర్కెల్ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మిత్రపక్షాల డిమాండ్లను అంగీకరించకపోతే తదుపరి అడుగు పడే అవకాశం లేదు కాబట్టి అందుకూ కొంత రాజీ ధోరణితో ఆమె సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా శరణార్థులకు సంబంధించి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వారి సంఖ్యను కుదించడం ద్వారా కన్సర్వేటివ్ శిబిరంలో ఎలాంటి పొరపొచ్చాలకు ఆస్కారం లేని సానుకూల వాతావరణాన్ని మెర్కెల్ పెంపొందించుకునే ప్రయత్నం చేయడం ఆమె రాజకీయ పరిణతికి, వ్యవహరదక్షతకు నిదర్శనమే. ఏటా రెండు లక్షలకు మించి శరణార్థులెవరూ జర్మనీలోకి రాకుండా పరిమితి విధించాలన్న దానిపై విస్తృతంగానే అధికార పార్టీలో చర్చ జరిగింది. ఇటీవలి ఎన్నికల్లో ఎఐడి పార్టీ విజయం సాధించడానికి ఈ శరణార్థుల వ్యవహారమే ప్రధాన కారణమైన నేపథ్యంలో మెర్కెల్ మిత్రపక్షాలన్నీ కూడా తదుపరి వ్యూహాలపై దృష్టిపెట్టాయి. ఇప్పటివరకూ ఏమాత్రం పట్టించుకోని డిమాండ్లను సైతం పరిశీలించక తప్పని పరిస్థితి కొత్త ప్రభుత్వ అవసరాల దృష్ట్యా మెర్కెల్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జర్మనీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ చిన్న పార్టీలే అయిన రెండు కీలక పార్టీలతో కఠినమైన రీతిలోనే చర్చలు జరపాల్సిన అవసరం అధికార పార్టీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కన్సర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని జార విడుచుకోకుండా సమైక్యంగానే ఈ సంకీర్ణ చర్చలు జరపాలన్నది మెర్కెల్ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. వ్యాపార అనుకూల ఫ్రీ డెమొక్రాట్స్ (ఎఫ్‌డిపి) అలాగే వామపక్ష భావాలు కలిగిన గ్రీన్స్ పార్టీలు పెట్టే షరతులు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎదుర్కోవడం ద్వారా తదుపరి సమస్యలకు తావు లేకుండా కొత్త సంకీర్ణాన్ని ఎలా ఏర్పాటు చేయాలన్నదే ఇప్పుడు మెర్కెల్ ముందున్న ఏకైక లక్ష్యం. మొదటినుంచీ కూడా శరణార్థుల వ్యవహారమే జర్మనీకి తలనొప్పిగా మారింది. 2015 నాటి పరిస్థితులు ఏమాత్రం పునరావృతమైనా అధికార కన్సర్వేటివ్‌కు మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అందుకు తావు లేని విధంగానే మెర్కెల్ పావులు కదుపుతున్నారు. రెండేళ్ల క్రితం అటు సిరియా నుంచే కాకుండా ఇతర కల్లోల దేశాల నుంచి జర్మనీకి శరణార్థులు వెల్లువెత్తారు. ఇప్పుడు ఆ తరహా పరిస్థితి రాకుండా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలనూ ఒకే తాటిపై నడిపించి శరణార్థులకు సంబంధించి గరిష్ఠ పరిమితిని విధించడం అన్నది మెర్కెల్‌కు ఎంతైనా అవసరం. ముఖ్యంగా సరిహద్దుల్లో నిఘా నియంత్రణలను పెంచడం ద్వారా దాదాపు అన్ని ఐరోపా యూనియన్ దేశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి శరణార్థుల సమస్యను పరిష్కరించడం ద్వారానే కొత్త సమస్యలకు తావు లేకుండా చేసుకునే అవకాశం ఉంటుందన్నది మెర్కెల్ తాజా ఆలోచన. వలసదారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఎఐడి పార్టీ జర్మనీ ప్రజలను విశేషంగా ఆకర్షించడమే కాకుండా 12.6 శాతం ఓట్లను సాధించి పార్లమెంటులోకి ప్రవేశించింది. ఈ తరహాలో ఇతర పార్టీలు కొత్త డిమాండ్లతో ముందుకు రాకుండా ఉండాలంటే ఇమ్మిగ్రేషన్ విధానానికి మరింత పదును పెట్టడమే కాకుండా వలసదారుల సంఖ్యనుకూడా గరిష్ఠస్థాయిలో కుదించడం అన్నది ఎంతైనా అవసరం. ఏ విధంగా చూసినా కూడా భిన్నమైన వైఖరులతో శరణార్థులకు సంబంధించి వివిధ పార్టీలు డిమాండ్లను చేస్తున్న నేపథ్యంలో సంకీర్ణ చర్చలు మెర్కెల్‌కు కత్తిమీద సాము చందంగానే పరిణమించే అవకాశం ఉంది. శరణార్థుల సమస్యతోపాటు బొగ్గుగలను దశల వారీగా తొలగించడం, అలాగే శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం అన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. తమ విభేదాలను పక్కనబెట్టి కన్సర్వేటివ్‌లు సమైక్యంగా ముందుకు వస్తేనే కొత్త సంకీర్ణానికి దారులు ఏర్పడతాయి. లేనిపక్షంలో చర్చోప చర్చలతోనే వారాలకు వారాలు గడిచిపోయే అవకాశం ఉంది. మరి ఈ సమస్యను మెర్కెల్ ఏ విధంగా అధిగమిస్తారు? ఎంతమేరకు కన్సర్వేటివ్‌ల్లో ఐక్యతను సాధించగలుగుతారు అన్నది వేచి చూడాల్సిందే.