స్పాట్ లైట్

విజేత కెన్యట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాస్పదంగా మారిన కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా కెన్యట్టా అంతిమంగా ఎన్నిక కావడం గత కొన్ని రోజులుగా సాగుతున్న హింసాత్మక పరిణామాలకు తెరిదించింది. తొలి ఎన్నిక వివాదాస్పదం కావడంతో రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికలకు నిర్వహించాల్సి రావడంతో దేశంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఉత్కంఠ, ఉద్వేగం, హింస మధ్య అధ్యక్షుడు కెన్యట్టానే విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. అయితే ఆయనకు 98 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఈ తూర్పు ఆఫ్రికా దేశంలో ఈ తాజా పరిణామం వల్ల తీవ్రస్థాయిలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. అయితే అధ్యక్ష పదవికి పోటీచేసిన రైలా ఓడింగా మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో అట్టుడికి పోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అంతుబట్టని స్థితి ఏర్పడింది. మొదట అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 40 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆ ఎన్నికల్లో తీవ్రస్థాయి అవకతవకలు చోటుచేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలను తాజాగా నిర్వహించాల్సి వచ్చింది. దాంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మొత్తంమీద రెండోసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కెన్యట్టా విజయం సాధించడం కొంతమేర ఊరట కలిగించే పరిణామమే. అయితే ఈ ఎన్నిక ఫలితంపై ప్రతిపక్ష నేత మద్దతుదారులు న్యాయపరంగా సవాళ్లు విసిరే అవకాశం ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధ్యక్ష ఎన్నిక ఫలితం వెలువడినప్పటికీ ఇది ఇప్పటికప్పుడే ఓ కొలక్కి వచ్చే అవకాశం లేదు. దీని ప్రభావం వల్ల దేశంలో రాజకీయంగా వ్యాపార, వాణిజ్యపరంగా అనేక సవాళ్లు, సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కొత్త అధ్యక్షుడు కెన్యట్టానే అంగీకరించారు. న్యాయపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కెన్యా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై ఆమ్నెస్టీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై పోలీసులు మితిమీరిన రీతిలో వ్యవహరించారని ధ్వజమెత్తింది.