స్పాట్ లైట్

తస్మాత్ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణంలో పెరిగిపోయిన కార్బన్ డై ఆక్సైడ్
లక్షలాది సంవత్సరాలుగా కనివీని ఎరుగని పరిణామం
సముద్ర ఉపరితలం పెరిగిపోయే ప్రమాదం
అదే జరిగితే భూగోళం నిప్పుల కొలిమే

కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం వాతావరణలో పెరిగిపోతోందంటూ ఐరాస హెచ్చరించడం ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించే పరిణామమే. వచ్చే నెలలో ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో తీసుకునే నిర్ణయాలను ఏ విధంగా అమలుచేయాలనే దానిపై ప్రపంచ దేశాల పర్యావరణ మంత్రులు బాన్‌లో సమావేశమవుతున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆ సదస్సులో చర్చ జరిగే అవకాశం ఉంది.

వాతావరణంలో కాలుష్య ఉద్గారాల విసర్జన ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ఆందోళనకర స్థాయికి చేరుకుందంటూ ఐక్యరాజ్య సమితి చేసిన హెచ్చరిక ప్రపంచ దేశాల్లో కలవరం రేపుతోంది. ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో సివో2 ప్రభావం పెరిగిపోవడం వల్ల సముద్ర ఉపరితలాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని, అదే విధంగా ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న గ్రీష్మతాపం మరింతగా జనజీవనాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉందంటూ ఐరాస చేసిన హెచ్చరిక ఇప్పటివరకూ పర్యావరణ సమతూకాన్ని కాపాడుకోలేని ప్రపంచ దేశాల నిర్లక్ష్య ఫలితమే. ఈ స్థాయిలో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైజ్ పెరిగిపోవడం అన్నది కొన్ని లక్షల సంవత్సరాలుగా ఎన్నడూ కనీవినీ ఎరుగని పరిణామమే అంటూ ఐరాస వెల్లడించింది. ఇదే పరిస్థితి ఎలాంటి నివారణ చర్యలు లేకుండా కొనసాగితే సముద్ర ఉపరితలం దాదాపు 20 మీటర్ల ఎత్తుకు పెరిగే ప్రమాదం ఉంటుందని, అదే జరిగితే సముద్రతీర ప్రాంతాల్లోని దేశాలన్నీ నిండా మునిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా మరో మూడు డిగ్రీలు పెరిగిపోయేందుకు ఈ కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ప్రధానంగా కారణమయ్యే అవకాశం ఉంది.
గతంలో కూడా వాతావరణంలో సివో2 పరిమాణం ఆందోళన కలిగించినప్పటికీ పరిస్థితులు ఇంతగా చేజారిపోయే స్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అన్నట్టుగా వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం పెరిగిపోతూనే వస్తోంది. గత దశాబ్దంతో పోలిస్తే ఈ దశాబ్ద కాలంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మంచియుగం నాటి పరిస్థితులకంటే కూడా చాల వేగంగానే వాతావరణంలో సివో2 ప్రభావం పెరిగిపోతూ వస్తోందని ఐరాస స్పష్టం చేసింది. ఇప్పటికే పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించుకునే లక్ష్యంతో ప్రపంచ దేశాలు అనేక శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాయి. ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం తప్ప తదుపరి చర్యలేవీ అమలుకు నోచుకోలేదు. ప్రపంచ దేశాలు తీర్మానాలతోనే వాతావరణ సమతూక పరిరక్షణను సరిపెట్టాయనే చెప్పాలి. కాలుష్య ఉద్గారాల విసర్జన పరిమాణాన్ని కుదించుకోవాలని, వాతావరణ ఉష్ణోగ్రత మరింతగా పెరిగిపోకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడమే తప్ప వాస్తవికంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2015లో జరిగిన ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు కూడా పర్యావరణ సమతూక పరిరక్షణకు అనుల్లుంఘనీయమైన ఆదేశాలు జారీచేసింది. ప్రపంచ దేశాలన్నీ బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే తప్ప పర్యావరణ సమతూకాన్ని, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే పరిస్థితే ఉండదని హెచ్చరించింది. ఆ ఒప్పందాన్ని 195 దేశాలు ధృవీకరించాయి. దాని నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. ఏ దేశానికి ఆ దేశం తన వంతు బాధ్యతగా పర్యావరణ సమతూక భారాన్ని భుజాన వేసుకుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు లక్ష్యమే నీరుగారిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం వాతావరణలో పెరిగిపోతోందంటూ ఐరాస హెచ్చరించడం ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించే పరిణామమే. వచ్చే నెలలో ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో తీసుకునే నిర్ణయాలను ఏ విధంగా అమలుచేయాలనే దానిపై ప్రపంచ దేశాల పర్యావరణ మంత్రులు బాన్‌లో సమావేశమవుతున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆ సదస్సులో చర్చ జరిగే అవకాశం ఉంది.
అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలను రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు కుదించేలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉష్ణోగ్రత స్థాయి ఇంతకుమించి పెరగకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పర్యావరణ మంత్రులు చర్చిస్తారు. వాతావరణ ఉష్ణోగ్రత అనేక కారణాల వల్ల పెరిగిపోతుంది. బొగ్గు, చమురు, సిమెంట్, అడవుల నిర్మూలన వంటి వాటి కారణంగా 2016లోనే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం వాతావరణంలో పెరిగిపోయింది. అలాగే వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్‌నినో కూడా సివో2 స్థాయి వాతావరణంలో పెరిగిపోవడానికి తీవ్రంగానే దోహదం చేసింది. చివరిసారిగా వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి 400 పిపిఎంలకు చేరుకోవడం అన్నది 30 లక్షల నుంచి 50లక్షల సంవత్సల క్రితమే జరిగింది. గత రెండున్నర దశాబ్దాలుగా వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రత కూడా అవధులు దాటిపోయింది. అంటే దాదాపు 40 శాతానికి పైగా పెరిగింది. మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి మరింతగా వాతావరణంలో తీవ్రమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను యుద్ధప్రాతిపదిక నిర్వర్తించని పక్షంలో భూమండలం అగ్నిగుండంగా మారిపోవడానికి మనకు మనమే కారణం అవుతాం. మానవ జాతితోపాటు సమస్త జీవజాతులు ఈ విపరిణామాలకు గురై క్రమానుగతంగా నశించే ప్రమాదమూ ఉంటుంది. ఐరాస హెచ్చరిక నేపథ్యంలో మాటలు మాని పర్యావరణ సమతూక పరిరక్షణను చేతల్లో చూపించడానికి ప్రపంచ దేశాలు యుద్ధప్రాతిపదికన కదలాల్సిన తరుణం ఆసన్నమైంది.