స్పాట్ లైట్

ఇక అమీతుమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియాతో అమీతుమీ తేల్చుకోడానికే అమెరికా సిద్ధమవుతోందా? గత కొన్నివారాలుగా ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై చెలరేగుతున్న వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ విస్పష్టంగానే తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. ఉత్తర కొరియాను దారికి తేవాలంటే ఏఏ మార్గాల్లో ముందుకు వెళ్లాలన్నదానిపై విస్తృత సమాలోచనలు జరిపిన ట్రంప్ ఇంకా వౌనం వహిస్తే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంటుందన్న నిర్ణయానికి ఆయన వచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ ఉత్తర కొరియా అంశంపై అన్ని దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమం నాగరిక సమాజానికే గొడ్డలిపెట్టులాంటిదన్న ఆయన ఆ దేశాధినేత కిమ్‌జోంగ్ అదుపుచేయకపోతే ఆయన చేష్టల వల్ల ప్రపంచ శాంతికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఉత్తర కొరియా, అమెరికా మధ్య దీర్ఘకాలంగా వివాదం చెలరేగుతునే ఉంది. ముఖ్యంగా దక్షిణ కొరియాను అమెరికా వెనకేసుకు రావడం దానితో కలిసి సైనిక విన్యాసాలు చేయడం అన్నది ఉత్తర కొరియా నాయకత్వంలో గుబులు పుట్టించడమే కాకుండా ఏ మాత్రం అప్రమత్తత వీడినా తమ ఉనికికే ప్రమాదం ఉన్న భావనను కలిగించింది. ఇప్పటికే ఐరాసతోపాటు అనేక దేశాలు ఆంక్షలు విధించడంతో మరింతగా రెచ్చిపోయిన ఉత్తర కొరియా నాయకత్వం అంతిమంగా స్వీయ రక్షణ పేరుతో హైడ్రోజన్ బాంబునే పరీక్షించింది. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్‌జోంగ్‌ల మధ్య మాటల యుద్ధం క్రమంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడానికి ఏ క్షణంలోనైనా యుద్ధం అనివార్యం కావడానికి దారితీసింది. అమెరికా ఎంతగా రెచ్చగొడితే అంతగానే తాము తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతామని స్పష్టం చేసిన ఉత్తరకొరియా ఆ దిశగానే పావులు కదుపుతోంది. ఈదేశాన్ని ఏమాత్రం విస్మరించినా దాని హెచ్చరికలు ఖాతరు చేయకపోయినా పరిస్థితి విషమించే ప్రమాదం ఉందన్న ఆందోళనతోనే అమీతుమీ తేల్చుకోడానికి అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం విరుచుకుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే చైనా ఎలా స్పందిస్తుంది? రష్యా వ్యవహరించబోయే తీరు ఎలా ఉంటుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.