స్పాట్ లైట్

డ్రాగన్ దూకుడు.. భారత్ కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర దేశాలతో వ్యూహాత్మక బంధం వన్ బెల్ట్‌కు దీటుగా ప్రత్యామ్నాయానికి కసరత్తు

చైనా సర్వాధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ తిరుగులేని అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో డ్రాగన్‌ను నిలువరించేందుకు, దాని దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ ఏ రకమైన వ్యూహ ప్రతివ్యూహాలను అనుసరించబోతోందన్నది అత్యంత కీలకంగా మారింది. నిన్న మొన్నటివరకూ అరుణాచల్ మొదలుకుని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు ప్రతి విషయంలోనూ చైనా తన తగవులమారితనాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. భారత్‌ను అనేక కోణాల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడంతోపాటు దక్షిణ చైనా మహాసముద్రం ప్రాంతంపైనా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఇరుగు పొరుగు దేశాల నౌకాదళాలను నిలువరించేందుకు చైనా పన్నని వ్యూహం లేదు. ఈ నేపథ్యంలో బలమైన అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్న భారత్ తనదైన రీతిలోనే జన చైనాకు కళ్లెం వేయడానికి, దాని దూకుడును అరికట్టడానికి బలమైన ప్రయత్నాలను చేపట్టడం అన్నది నేటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వేసిన అడుగుగానే భావించాలి. చైనాను నిలువరించకపోతే అది మరింతగా రెచ్చిపోయి భారత మిత్రదేశాలను తనవైపు తిప్పుకునే అవకాశం కూడా ఎంతైనా ఉంటుంది. ఈ పరిస్థితి తీవ్రతను గుర్తించిన భారత్ ఆలస్యంగానైనా తన నౌకాదళానికి పదును పెట్టడంతోపాటు దాన్ని అన్ని విధాలా శక్తివంతంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల ద్వారా నౌకాదళ శక్తియుక్తులను ఇనుమడింపచేసుకుంటోంది. ఇతర దేశాలతో నౌకాదళ సంబంధాలను వ్యూహాత్మక రీతిలో పెంపొందించుకోవడంతోపాటు సొంతంగా కూడా నౌకాదళ సన్నద్ధతను శక్తివంతంగా మార్చుకుంటోంది. ముఖ్యంగా చైనా తాజా నాయకత్వం అనుసరిస్తున్న కొత్త విధానం అనేక రకాలుగా భారత దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఎంతైనా ఉంది. పదాతిదళాల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా నౌకాదళంపైన, వైమానిక శక్తిని పెంపొందించుకోవడంపైన చైనా దృష్టి పెట్టడడంతో భారత్ కూడా ఇదే రీతిలో వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా చూసినా కూడా చైనా తాజా విధానం భారత్‌కు ముందస్తు హెచ్చరిక లాంటిదే. ఇటీవల వన్‌బెల్ట్ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా పరోక్షంగా చైనా తన ఆధిపత్య ధోరణిని చాటిచెప్పింది. ఆ సందర్భంగా జరిగిన సమావేశాన్ని బహిష్కరించిన భారత్, తనదైన రీతిలోనే నిరసన వ్యక్తం చేసింది. చైనా దూకుడుకు కళ్లెం వేయాలంటే అనేక రకాలుగా భారత్ తన వ్యూహాత్మక శక్తిని ఇతర దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలను పెంపొందించుకుని తీరాలి. ఇటీవల భారత్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌టిల్లర్‌సన్ చైనా దూకుడును భారత్ కళ్లకు కట్టారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోనూ, భారత్ ఉప ఖండంలోకూడా ఇరు దేశాలు వ్యూహాత్మక బంధాన్ని పెంపొందించుకుంటేనే చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం ఉందంటూ ఆయన చేసిన సూచన తాజా పరిణామాల దృష్ట్యా అనేక కోణాల్లో కీలకమైనదే.
వన్‌బెల్ట్-వన్‌రోడ్ (ఓబిఓఆర్) చైనా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు అనేక దేశాల మీదుగా సాగుతుంది కాబట్టి ఆయా దేశాలపై చైనా అనేక విధాలుగా పట్టును సంపాదించుకునేందుకు వీలుంటుంది. ఇటీవలే రష్యాతో విస్తృత స్థాయిలోనూ భారత్ సంయుక్త సైనిక విన్యాసాలను చేపట్టింది. ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు ఇందులో పాల్గొనడం అన్నది ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న రక్షణ బంధానికి సంకేతంగా నిలిచేదే. దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతంపై చైనా పట్టును సడలించేందుకు అమెరికా కూడా ఇటీవలి కాలంలో వ్యూహాత్మక రీతిలోనే చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల తరఫున ఈ అంశంపై అమెరికా జోక్యం చేసుకోవడం అన్నది ఒకరకంగా చైనాకు మింగుడు పడని పరిణామమే. చైనా చేపడుతున్న వన్ బెల్ట్-వన్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా భారత్, అమెరికా కూడా చేతులు కలిపి తమ శక్తియుక్తులను చాటుకోవాలన్న కీలక ప్రతిపాదననే ఇటీవల భారత పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి చేయడం ప్రాధాన్యత సంతరించుకున్న అంశమే. ముఖ్యంగా బంగ్లా, ఆప్ఘనిస్తాన్‌లతో అనుసంధానతలను పెంపొందించుకోవాలని, ఆ విధంగా చేయడం వల్ల పాకిస్తాన్‌ను కూడా దారికి తీసుకురావచ్చునన్న అమెరికా ఆలోచన ఒకరకంగా భారత్‌కు భౌగోళికపరమైన ప్రయోజనాన్ని కలిగించేదే అవుతుంది. అయితే ఈ రకమైన ప్రాజెక్టుకు పాకిస్తాన్ సుముఖంగా ఉన్నా ఆ దేశ నాయకత్వానికి చైనా కళ్లెం వేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చైనాకు పాక్ లక్షలాది డాలర్ల మేర రుణాలు చెల్లించాల్సి ఉంది. మరోపక్క జపాన్ కూడా చైనాకు కళ్లెం వేసే విషయంలో క్రియాశీలకంగానే ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియాల మధ్య చర్చ జరగాలన్న ప్రతిపాదనను జపాన్ విదేశాంగ మంత్రి తారోకోనో చేశారు. దక్షిణ చైనా మహాసముద్రం, హిందూ మహాసముద్రం మీదుగా స్వేచ్ఛా వాణిజ్య మండలిని రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆఫ్రికాకు మార్గాన్ని సుగమనం చేసుకోవాలనేది ఆయన చేసిన సూచన. ఈ అంశంపై సంబంధిత దేశాలు మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే ఇతమిత్థంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తే దీన్ని అదునుగా చేసుకుని చైనా తన నిర్మాణాల వేగాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతంపై తన హక్కులను మరింతగా ధ్రువీకరించుకోవడంపాటు ఈ ప్రాంతం మీదుగా సాగే వాణిజ్యాన్ని కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఈ సముద్ర ప్రాంతంలోని పారాసెల్ దీవులను రక్షించుకోవడానికి చైనా తన యుద్ధ విమానాలను కూడా మోహరించే అవకాశం కనిపిస్తోంది. 1
జపాన్, ఆస్ట్రేలియా కూడా భారత్, అమెరికాలతో చేతులు కలిపి ఓ బలమైన వలయంగా ఏర్పడితే, అదేవిధంగా ఇటు యునైటెడ్ కింగ్‌డమ్‌ను, ఫ్రాన్స్‌ను కూడా ఈ కూటమిలో కలుపులోగలిగితే చైనాకు గట్టి సవాలే ఎదురవుతుంది. కాని ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ మేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. భారత్‌కు సంబంధించినంతవరకు చైనాతో నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తూనే ఎప్పటికప్పుడు దాని వ్యూహాలకు ప్రతివ్యూహాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా తన నౌకాదళాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా సముద్ర హక్కులపై భారత్ మరింతగా పట్టు బిగించ గలుగుతుంది. అలాగే హిందూ మహాసముద్ర పరీవాహక ప్రాంత దేశాలతోనూ లోతైన సంబంధాలను పెంపొందించుకోవడం కూడా భారత్‌కు ఎంతైనా అవసరం. ఈ విషయంలో రష్యాకు ఎంతగా చేరువైతే, ఎంతగా దానితో అనుబంధాన్ని పెంపొందించుకుంటే అంతగానూ భారత్‌కు ప్రయోజనకరం అవుతుంది. చైనా అన్ని విధాలుగా తన బలాన్ని చాటుకుంటున్న తరుణంలో భారత్ ఎంతమాత్రం ఏమరుపాటుగా ఉండడానికి వీలులేదు. ఇటు వ్యూహాత్మకంగానూ, అటు దౌత్యపరంగానూ తన శక్తియుక్తులను చాటుకుని తీరాల్సిందే. అందుకు మోదీ సర్కార్ అనుసరించబోయే వ్యూహం ఏమిటి అన్నది అత్యంత కీలకం కాబోతోంది.

బి.రాజేశ్వర ప్రసాద్