స్పాట్ లైట్

మనుగడకే ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమండలాన్ని, అందులో నిబిడీకృతమై ఉన్న సమస్త జీవజాతులను కాపాడుకునేందుకు తక్షణ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ముప్పును కొనితెచ్చుకున్నట్టే అవుతుందని దాదాపు 15వేల మంది శాస్తవ్రేత్తలు ముక్తకంఠంతో హెచ్చరించారు. వాతావరణంలో కాలుష్య ఉద్గారాల విసర్జన అపరిమితంగా పెరిగిపోవడం, పర్యావరణ సమతూకం దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో సమస్త జీవజాతుల మనుగడకు ముప్పువాటిల్లే పరిస్థితులు ఎప్పటికప్పుడు తీవ్రమవుతున్నాయంటూ భిన్నరంగాలకు చెందిన శాస్తవ్రేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ పర్యావరణ పరిరక్షణకోసం ఎన్నో శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. ముఖ్యంగా తలమానికమైన రీతిలో ప్యారిస్ పర్యావరణ సదస్సు జరిగినప్పటికీ అక్కడ చేసిన తీర్మానాలేవీ పూర్తిస్థాయిలో ఆచరణ యోగ్యతను సంతరించుకోకపోవడంవల్ల పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రతికూలంగా మారుతున్నాయి. ధనిక, మధ్యతరగతి, పేద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలు పర్యావరణ సమతూకాన్ని వ్యక్తిగతంగానూ ఉమ్మడిగానూ పరిరక్షించుకుని భూమీద ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతే కొరివే తలగోక్కునే తరహాలోనే పరిస్థితులు అనతికాలంలోనే విషమించే ప్రమాదం ఉందని ఈ బృందం స్పష్టం చేసింది. నిజానికి 20 ఏళ్ల క్రితమే భూగోళ పరిరక్షణ పర్యావరణ సంరక్షణకు సంబంధించి అప్పట్లో అనేకమంది నోబెల్ బహుమతి గ్రహీతలు ఉమ్మడిగా సంతకం చేసిన ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ వారి హెచ్చరికను ఎవరూ ఖాతరు చేయకపోవడం వల్ల పరిస్థితులు మరింతగా విషమించాయి. ఇప్పటికే పర్యావరణ పరంగా దారుణమైన విధ్వంసమే జరిగింది. సూర్యుడి ప్రమాదకర కిరణాల నుంచి భూమిని రక్షించే ఓజోన్ పొర నానాటికీ పలుచబడిపోతోంది. అలాగే ప్రకృతి సమతూకాన్ని కాపాడే అటవీ సంపద కూడా అభివృద్ధి పాలిటబడి హరించుకుపోతోంది. వీటన్నింటి పర్యవసానంగా వాతావరణ మార్పులు అత్యంత ప్రమాదకరంగా పరిణమించడంతో ప్రకృతి సమతూకానికే తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇప్పటికే వీటన్నింటికీ తీవ్రస్థాయిలో నష్టం జరిగిందని, ఇంకేమాత్రం ఉపేక్షించినా తక్షణ చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కపెట్టినా పుడమికి ముప్పు తథ్యమన్న శాస్తవ్రేత్తల హెచ్చరికను శిరసావహించి తక్షణ ఆచరణాత్మక చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్ తరాలకు భూమిమీద మనుగడే కష్టమేనన్నది ఈ హెచ్చరిక సారాంశం. మాటలతో కాకుండా చేతల్లో ప్రపంచ దేశాలు ఉద్యుక్తం అయితేనే భూగోళాన్ని, అందులో నివసిస్తున్న సమస్త జీవకోటిని కాపాడుకునే అవకాశం ఉంటుంది.