స్పాట్ లైట్

ఎదురుదాడే దారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతేడాది లక్షిత దాడులతో దారికి వచ్చినట్టే వచ్చిన పాక్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. పదేళ్ల క్రితం నాటి 26/11దాడి, పఠాన్‌కోట్ వేడి రగులుతూండగానే మరోసారి బరితెగించి భారత సైనికుల్ని అమానుష రీతిలో హతమాచర్చడం ద్వారా తన రాక్షసత్వాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సంయమనానికి హద్దుంటుంది. స్నేహానికీ పరిమితి ఉంటుంది..పాక్‌తో ఇవేవీ పొసగవన్న నిజం మరోసారి రుజువైంది. తాజాగా భారత సైనిక దళాలపై పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన దాడి, ఇద్దరు జవాన్ల మృత దేహాలను పైశాచిక రీతిలో ఛిద్రం చేసిన తీరు సభ్య ప్రపంచాన్ని బెంబేలెత్తించే సంఘటన. దేశాల మధ్య స్నేహం ఉండకపోవచ్చు కానీ, ఈ రకమైన రాక్షస ధోరణి మాత్రం సహించలేనిదే. దేశ విభజన జరిగిన నాటి నుంచి పాకిస్తాన్‌తో ఎన్నో యుద్ధాలు జరిగాయి. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల్ని పాదుగొల్పేందుకు ఎన్నో శాంతి ఒప్పందాలు కుదిరాయి. వాటన్నింటినీ కాగితాలకే పరిమితం చేస్తూ ఇటు పాకిస్తాన్ సైనికులు, అటు ఐఎస్‌ఐ ప్రోద్బలంతో భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద మూకలు చేపడుతున్న చర్యలు ఇరు దేశాల మధ్య ఎప్పటికప్పుడు వైషమ్యపూరిత వాతావరణానే్న పెంచాయి.కాశ్మీర్‌నే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్రవాద క్రీడకు అక్కడ గత దశాబ్దకాలంగా జరుగుతున్న ఎన్నికలు చెక్ పెట్టాయి. తాము ప్రజాస్వామ్యయుత పరిస్థితుల్నే కోరుకుంటున్నామే తప్ప భారత వ్యతిరేకత తమలో ఎంత మాత్రం లేదన్న వాస్తవాన్ని తమ తీర్పుల ద్వారా ప్రజలు చాటిచెప్పారు. దాంతో బేజారెత్తిన పాకిస్తాన్..ఏకంగా సైనికుల్నే లక్ష్యంగా చేసుకుని మట్టుబెట్టే దాష్టీకానికి తెగించింది. మూడేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రధానిగా తన పదవీ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడం ద్వారా తన మనసులోని మాటను మోదీ చెప్పకనే చెప్పారు. ఒక్క పాకిస్తాన్‌తోనే కాకుండా ఇరుగుపొరుగు దేశాలన్నింటితోనే సత్సంబంధాలు కలిగి ఉండాలన్నదే తమ ఆశయమన్న విశాల హృదయాన్నీ చాటి చెప్పారు. అధికారికంగా పర్యటించాల్సిన కార్యక్రమం ఏమీ లేకపోయినా కూడా రష్యా నుంచి నేరుగా ఇస్లామాబాద్ వెళ్లి నవాజ్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని స్నేహమే మన దేశాలకు కావాల్సిందన్న బలమైన సందేశానే్న అందించారు. అది జరిగిన రెండు రోజులు తిరక్కుండానే పఠాన్‌కోట్‌పై పాక్ ముష్కర మూకలు విరుచుకు పడి అనేక మంది భారత సైనికుల్ని మట్టుబెట్టాయి. ముల్లునుముల్లుతోనే తీయాలన్న సామెతను అక్షర సత్యం చేసిన భారత్ అనూహ్య రీతిలో లక్ష్యిత దాడులకు దిగి ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. తమ దాడులు ఎంత అవసరమో వివరించడంతో పాటు పఠాన్‌కోట్‌తో తమకు సంబంధం లేదన్న పాకిస్తాన్ వాదనను తుత్తునియలు చేయడానికి ఆ దేశానికి చెందిన బృందానే్న ఆహ్వానించి స్వీయ దర్యాప్తుకు ఆస్కారం ఇచ్చింది. ముంబయి దాడులకు సంబంధించి దోషుల్ని శిక్షించాలంటూ ఇప్పటి వరకూ భారత్ ఎన్నో ఆధారాలు అందించినా వాటిని తిరస్కరించుకుంటూ వచ్చిన పాకిస్తాన్ నైజంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ‘ముంబయి’ దోషుల్ని ఇప్పటి వరకూ శిక్షించిన పాపాన పోలేదు.

-బి.రాజేశ్వరప్రసాద్