స్పాట్ లైట్

మళ్లీ జెరూసలెం సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య రగులుకుంటున్న జెరూసలెం వివాదం ఇప్పుడు టర్కీ-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. జెరూసలేం హోదా విషయంలో ఏమాత్రం ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నా ఇజ్రాయెల్‌తో తెగతెంపులు చేసుకోవడానికి తాము వెనుకాడేది లేదని టర్కీ ప్రధాని ఎర్డోగన్ చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాలా లేదా అసే అంశంపై తాము పరిశీలన జరుపుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తీవ్రంగా స్పందించడం ఈ సమస్య సునిశిత స్వభావానికి అద్దం పడుతోంది. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా చేసే ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ ఇతర అంశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళితే మాత్రం తాము సహించేది లేదని, తక్షణ ప్రాతిపదికన ఇస్లాం గ్రూపు లన్నింటినీ సమావేశపరిచి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఎర్డోగన్ తెగేసి చెప్పారు. ట్రంప్ ఈ విషయంలో విచక్షణాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఎర్డోగన్ స్పష్టం చేశారు.
జెరూసలెం ముస్లింలకు రెడ్‌లైన్ వంటిదని స్పష్టం చేసిన ఆయన, ట్రంప్ తన ఆలోచనను మార్చుకోకపోతే నిర్ణయం తీసుకున్న పది రోజుల్లోనే మొత్తం ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేస్తానని హెచ్చరించారు. ఏడేళ్ల క్రితం గాజా వెళుతున్న ఓ నౌకపై ఇజ్రాయెల్ బాంబు దాడి జరిపినప్పటి నుంచీ టర్కీతో దాని సంబంధాలు ఎడమొగం పెడమొగంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఆ పరిణామం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను టర్కీ కుదించుకుంది. పాలస్తీనా ప్రజల మనోభావాలకు ఏ విధంగానూ విఘాతం కలిగించడానికి వీలు లేదని స్పష్టం చేసిన ఎర్డోగన్ ఈ విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే అమెరికా తన పశ్చిమాసియా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు దేశాల విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తోంది. నాటో కూటమిలో అత్యంత కీలకమైన ముస్లిం సభ్యదేశంగా ఉన్న టర్కీతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పశ్చిమాసియాలో తనకు అత్యంత బలమైన మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జెరూసలేం వ్యవహారం మొదటినుంచీ వివాదాస్పదంగానే కొనసాగినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితి మొదటికొచ్చినట్లయింది. మొదట్నుంచీ కూడా పాలస్తీనా ఉద్యమం పట్ల టర్కీ సానుకూలంగానే స్పందిస్తూ వస్తోంది. ఇటు మిత్రదేశాలను, అటు అరకొర సంబంధాలు కలిగివున్న దేశాలతోనూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ జెరూసలేం అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా మళ్లీ ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య అగ్నికి ఆజ్యం పోయడమే కాకుండా, అటు టర్కీని కూడా పరోక్షంగా కవ్వించినట్లే అయింది. ఒకపక్క ఉత్తర కొరియా సమస్యతోనూ, ఐసిస్ ఉగ్రవాద మూకల ఆగడాలతోనూ, మరోపక్క సరియా కొరివితోనూ తలపట్టుకుంటున్న ట్రంప్‌కు ఇప్పుడు టర్కీ హెచ్చరిక మరో గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది. టర్కీ-ఇజ్రాయెల్ మధ్య అంతంతమాత్రంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొడితే మాత్రం అది నాటో కూటమిపైనే తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలావుండగా, ట్రంప్ ప్రతిపాదనపై సౌదీ అరేబియా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతోపాటు ఈ నిర్ణయం వల్ల పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్య మళ్లీ రగులుకునే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. జెరూసలేం హోదా ఏమిటనేదానిపై దీర్ఘకాలంగా తన మనసులోని మాటను బయటపెట్టని అమెరికా ఈ వారంలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో అరబ్ ప్రపంచం ఒక్కసారిగా భగ్గుమంటోంది. నిన్న మొన్నటివరకూ జెరూసలెంకు సంబంధించి తటస్థ వైఖరినే అమెరికా అవలంబిస్తూ రావడంవల్ల ఇటు పాలస్తీనాలోగాని, అటు ముస్లిం ప్రపంచంలోగాని ఎలాంటి ప్రతిస్పందనా లేదు. ఇప్పుడు అనూహ్యరీతిలో జెరూసలెం అంశాన్ని రగిలించడం ద్వారా సరికొత్త అంతర్జాతీయ రగడకే ట్రంప్ ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఎప్పుడైతే తమ దౌత్య కేంద్రాన్ని జెరూసలెంకు మారుస్తామని ట్రంప్ ప్రకటించాడో ఆ సమయంలోనే జెరూసలెం ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ప్రస్తుతం అనేక దేశాలు సమష్టిగా చేసిన కృషి ఫలితంగా పాలస్తీనా-ఇజ్రాయెల్‌కు మధ్య సంఘర్షణలకు తెరపడి మొత్తం పశ్చిమాసియాలోనే శాంతియుత పరిస్థితులు బలపడే అవకాశం కలిగింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని రీతిలో సాగుతున్న సంఘర్షణలకు మూలకేంద్రంగా జెరూసలేం ఉంద

బి.రాజేశ్వర ప్రసాద్