స్పాట్ లైట్

భూమికి వాయుకవచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోదసీకి సంబంధించి మరొక కీలకమైన, సంక్లిష్టమైన మిస్టరీని శాస్తవ్రేత్తలు డీకోడ్ చేశారు. గగతతలం నుంచి భూమిమీదకి పడే శకలాలు మధ్యలోనే ఎందుకు తునాతునకలైపోతాయి? అందుకు దారితీసే కారణం ఏమిటన్నదానిపై విస్తృత పరిశోధనలు జరిపి వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. ఈ ఉల్కలు భూమిమీద పడే క్రమంలో అత్యంత తీవ్రస్థాయిలో వాయుపీడనానికి గురవుతాయని, ఆ దట్టమైన గాలులు ఈ శకలాల్లోకి చొచ్చుకుపోతాయని అంతిమంగా అది చిట్లిపోయి విస్ఫోటనం చెందుతుందని స్పష్టం చేశారు. ఒక రకంగాచెప్పాలంటే ఈ రకమైన శకలాల నుంచి భూమిని కంచుకోటలా రక్షిస్తున్నది దట్టమైన గాలులు, అదే విధంగా బలమైన వాతావరణమేనని స్పష్టం చేశారు. అత్యంత తీవ్ర పీడనం కలిగిన వాయువులోకి శకలాలు లేదా మరేదైనా ప్రవేశిస్తే అది అనివార్యంగానే తీవ్ర ఒత్తిడికి గురవుతుందని, వాటి పొరల్లోకి వెళ్లే గాలివల్ల అంతర్గతంగా విచ్ఛిన్నమై భూమిని చేరుకోకముందే విస్ఫోటనం చెందుతుందని వివరించారు.
ఏ విధంగా చూసినా దట్టమైన పీడనం కలిగి, ఎగువ ఉపరితలంలో ఉండే గాలులు అనేక రకాలుగా పుడమికి తిరుగులేని రక్షణను కల్పిస్తున్నాయన్నది ఈ పరిశోధన సారాంశం. ఇలాంటి దట్టమైన గాలులు కలిగిన వాతావరణంలోకి ఏ శకలం ప్రవేశించినా కూడా అది పొరల్లోకి అనివార్యంగానే వాయువు చొరబడుతుందని, భూమిని చేరకుండానే అంటే భూమిని ఢీకొనక ముందే ఈ శకలం దానంతట అదే విచ్ఛిన్నమైపోతుందని వెల్లడించారు. గతంలో జరిగిన అంచనాలకు భిన్నమైన రీతిలోనే ఈ అధ్యయన ఫలితాలను శాస్తవ్రేత్తలు వెలుగులోకి తెచ్చారు. 2013లో రష్యాలోని సెలియాబిన్స్ ప్రాంతంలో ఒక గ్రహ శకలం గగనతలంలోనే విస్ఫోటనం చెందిన అంశంపై విస్తృత పరిశోధనలు జరిపి ఈ తాజా వివరాలను వెలుగులోకి తెచ్చారు. ఆ గ్రహ శకలం గాలిలోనే పేలిపోవడం వల్ల దాని అవశేషాలు మాత్రమే చెలియాబిన్స్ ప్రాంతమంతా చెదురుమదురుగా పడిన విషయం తెలిసిందే. ఆ గ్రహ శకల విస్ఫోటనం ప్రభావానికి ఓ చిన్న అణ్వాయుధం పేలిపోయినంత శక్తి ఉద్భవించిందని చెప్పిన శాస్తవ్రేత్తలు ‘అదే భూమిని ఢీకొన్న తర్వాత ఆ గ్రహ శకలం పేలిపోయి ఉండివుంటే అపారమైన, అనూహ్యమైన నష్టం కలిగివుండేదే’ అని వెల్లడించారు. ఆ గ్రహ శకలం బరువు దాదాపు పదివేల టన్నుల వరకు ఉందని, గాలిలోనే అది విస్ఫోటనం చెందిన తర్వాత చెదురు మదురుగా పడిన శకలాల్లో 2వేల టన్నుల అవశేషాలను కనుగొనగలిగారు. వాటిని విశే్లషించిన శాస్తవ్రేత్తలు ఈ తాజా అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదకర సూర్యకిరణాల బారినుంచి ఓజోన్ పొర ఎలా రక్షిస్తోందో రోదసీ నుంచి దారితప్పి భూమి దిశగా దూసుకువచ్చే గ్రహ శకలాల నుంచి అత్యధిక పీడనం కలిగిన వాయువులే రక్షిస్తున్నాయని వెల్లడించారు.