స్పాట్ లైట్

నేపాల్‌లో కొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో రాచరికం అంతమై ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దశనుంచి నేటి వరకు ఏ కోశానా సుస్థిర పాలన సాగిన దాఖలాలు లేవు. నేపాలీ కాంగ్రెస్, అలాగే ప్రచండ సారథ్యంలోని రాజకీయ కూటములు నువ్వా-నేనా అన్న రీతిలో పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నించడంవల్ల ఎప్పటికప్పుడు పరిస్థితి ఎండమావిగానే మారుతూ వచ్చింది. కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకునే విషయంలో ఏళ్లకు ఏళ్లే ఎలాంటి నిర్ణయం లేకుండా సాగిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పట్టుమని కొన్నాళ్లయినా అధికారంలో ఉండని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అనేక పార్టీలతో కూడిన వామపక్ష కూటమి అధికారంలోకి రావడం అన్నది ఓ ఆశావహ పరిణామమే. ఈకూటమి రాజకీయంగా శక్తివంతమైనది కాబట్టి సుస్థిర పాలనను అందించేందుకు ఓ బలమైన శక్తిగానే పనిచేసే అవకాశం కనిపిస్తోంది. అయితే కొత్త పార్లమెంట్ స్వరూప స్వభావాలు ఏమిటన్నది ఇప్పటికిప్పుడే తెలియకపోయినా ఈ కూటమి సాధించిన సీట్లను బట్టి చూస్తే దాదాపు 70 శాతం స్థానాలు దీని వశమయ్యాయి. రాజకీయ సుస్థిరత అన్నది ఓ పార్టీకి లభించే సీట్లు ఎన్ని అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. అరకొర మెజారిటీ లభిస్తే ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడక తప్పదు. ఇప్పటివరకు నేపాల్ రాజకీయాల్లో జరిగిందిదే కాబట్టి వామపక్ష కూటమి గణనీయంగా సీట్లను గెలుచుకోవడం వల్ల ప్రభుత్వ సుస్థిరతకు ఏరకంగానూ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు. ఈ వామపక్ష కూటమి అనేక రకాలుగా దేశ రాజకీయాలను కొత్తమలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది. 1990లో నేపాల్ ప్రజాస్వామ్య పథంలోకి అడుగుపెట్టినప్పటినుంచీ వామపక్ష పార్టీలకు ఇంత భారీ సంఖ్యలో మెజారిటీ రావడం అన్నది ఇదే మొదటిసారి. మావోయిస్టులు కూడా ఈ కూటమితో చేతులు కలపడం వల్ల సైద్ధాంతికంగానూ కొత్త ప్రభుత్వం బలమైన పునాదుల ప్రాతిపదికగానే ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఇతర పార్టీలు ఈ కూటమిని బలపరిచేందుకు అవకాశం ఉంది. 2008లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పటి నుంచీ ఎప్పటికప్పుడు మీనమేషాలు లెక్కపెడుతున్న చందంగానే సాగిన మావోయిస్టులు ఇప్పుడు ఈ కూటమికి మద్దతు ఇవ్వడం ఓ కీలక పరిణామమే. ఈ ఎన్నికల్లో మావోయిస్టులకు రెండోస్థానం రావడం కీలక పరిణామమే. చాలా ఏళ్లపాటు నేపాల్‌లో అధికారంలో కొనసాగిన నేపాల్ కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ నాయకత్వానికి అశనిపాతం. ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా నేపాలీ కాంగ్రెస్ పార్లమెంటులో తన రాజకీయ ప్రాభవాన్ని కోల్పోయింది. అలాగే ఈ పార్టీతో పొత్తుపెట్టుకున్న కూటములు కూడా దెబ్బతినడం అనూహ్యమైన పరిణామమే. శతాబ్దాల తరబడి రాచరిక వ్యవస్థలోనే మగ్గిన నేపాల్‌లో ప్రజాస్వామ్య ఆకాంక్షలను రగిలించి ఆ దిశగా ప్రజా బలాన్ని సమీకరించి ఓ ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఘనత ప్రచండ సారథ్యంలోనే మావోయిస్టులదే.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచండ పోకడలకు జనం విసుగెత్తిపోయారు. దాంతో ఓ పరంపరగా ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితీ ఏర్పడింది. ఆ విధంగా ఏళ్లకు ఏళ్లే గడిచిపోయాయి. మొత్తంమీద కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీలు సుస్థిర రాజకీయ వ్యవస్థను పాదుగొల్పే దిశగా బలమైన అడుగులే వేశారు. ఆ పరిణామాలన్నింటి ఉమ్మడి ఫలితంగానే ఈ తాజా ఎన్నికలు జరగడం వామపక్ష కూటమికి తిరుగులేని మద్దతు లభించి స్థిరమైన, బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కలగడం అభిలషణీయ పరిణామమే. వామపక్ష కూటమిలోని పక్షాలన్నీ కూడా సానుకూల దృక్పథాన్ని అనుసరించి నేపాల్ భవితను, ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని చేతులు కలిపినవే. అతివాదాన్ని విడనాడి దేశ రాజ్యాంగ, పార్లమెంటరీ విధానాల పరిమితులకు లోబడి పనిచేస్తామని బలమైన సంకేతాలు ఇవ్వడం వల్లే ఈ కూటమిని ప్రజలు విశ్వసించినట్లుగా భావించాలి. ఇప్పటివరకూ ఇంత భారీగా ఏ పార్టీకీ ప్రజలు మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఈ తాజా ప్రజా తీర్పును శిరసావహించి నేపాల్‌ను బలమైన రీతిలో ప్రజాస్వామ్య దిశగా పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఈ కూటమిపై ఉంది. అయితే రాజకీయంగా నేపాల్ ఎటు పయనిస్తుంది? ఏ విధంగా తన భవిష్యత్ లక్ష్యాలను ఈడేర్చుకునే ప్రయత్నం చేస్తుందన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. మొదట్నుంచీ కూడా భారత్ అనుకూల దేశాలను తనవైపుతిప్పుకునేందుకు చైనా ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు నాయకుడు ప్రచండ కూడా చైనా వైపే మొగ్గు చూపించి అనంతరం వాస్తవాలను తెలుసుకున్నారు. ఇప్పుడీ కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వం దేశ హితాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలే తప్ప సత్వర ప్రాతిపదికన అభివృద్ధిని సాధించేందుకు అడుగులు వేయాలే తప్ప ఎలాంటి ప్రలోభాలకు, తాయిలాలకు లోను కాకూడదు. అధికారంలోకి వచ్చిన వామపక్ష కూటమికి ఇదో బలమైన అవకాశమే కాకుండా అభివృద్ధి, పాలన దిశగా దృష్టి సారించడానికి ఎంతైనా వీలు కల్పించేది కూడా.